India GDP : 2023-24 ఆర్ధిక సంవత్సరానికి భారత్ జీడీపీ అంచనాలను మించి 8.2 శాతం వృద్ధి నమోదుచేసింది. జనవరి-మార్చి క్వార్టర్లో 7.8 శాతం వృద్ధి సాధించింది. గత ఆర్ధిక సంవత్సరంలో భారత్ జీడీపీ 7 శాతం వృద్ధితో పోలిస్తే మెరుగైన వృద్ధి సాధించిందని గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన డేటా వెల్లడించింది.
అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్ధ ఒడిదుడుకులకు లోనైనా భారత్ నిలకడైన వృద్ధి రేటు నమోదు చేయడం గమనార్హం. తయారీ రంగం ప్రోత్సాహకర వృద్ధి నమోదు చేయడంతో మెరుగైన జీడీపీ గణాంకాలు సాధ్యమయ్యాయని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
2023-24లో తయారీ రంగం ఏకంగా 9.9 శాతం వృద్ధి చెందింది. ఇక చివరి క్వార్టర్లోనూ భారత జీడీపీ 7.8 శాతంతో సత్తా చాటిందని తెలిపింది. అంతర్జాతీయ అనిశ్చితి పరిస్ధితులు, సవాళ్లు ఎదురైనా మన ఆర్ధిక వ్యవస్ధ పునరుత్తేజంతో ఉరకలెత్తిందని పేర్కొంది.
Read More :