Asia Cup Trophy : ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టు (Team India)కు ట్రోఫీ ఇవ్వకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. భారత క్రికెటర్లు తన చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి నిరాకరించారని.. ఆసియా క్రికెట్ మండలి (ACC) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) తనతో పాటు ట్రోఫీని తీసుకెళ్లడం ఆమోదయోగ్యం కాదని బీసీసీఐ మండిపడుతోంది. నఖ్వీపై వేటు వేయాలని ఐసీసికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. పరిస్థితులు చేయిదాటిపోతుండడంతో ఏసీసీ దిగొచ్చింది. టీమిండియాకు ట్రోఫీ ఇవ్వాలా? వద్దా? అనే నిర్ణయాన్ని ఆసియాలోని ఐదు బోర్డులకు వదిలేసింది.
పదిహేడో సీజన్ ఆసియా కప్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు ఇష్టపడని భారత క్రికెటర్లు.. ఫైనల్లో గెలుపొందిన తర్వాత ఆ దేశ క్రికెట్ చీఫ్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు నిరాకరించారు. దాంతో.. నఖ్వీ ట్రోఫీని తీసుకొని వెళ్లిపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించిన బీసీసీఐ నఖ్వీ తీరును ఐసీసీ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించింది. ఈ పరిణమాల దృష్ట్యా మంగళవారం దుబాయ్‌లో ఏసీసీ చర్చించింది.
The Asia Cup 2025 trophy controversy took center stage after Team India’s thrilling win over Pakistan in the final. Despite their unbeaten run, India refused to accept the trophy from ACC chief and PCB chairman Mohsin Naqvi.
Read here: https://t.co/CenwS4QEF2#MohsinNaqvi… pic.twitter.com/oR1X65k5hT
— DNA (@dna) September 30, 2025
నఖ్వీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రోఫీపై ఏదో ఒకటి తేల్చే బాధ్యతను సభ్యదేశాల బోర్డులకు అప్పగించింది. భారత్‌తో పాటు శ్రీలంక, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ బోర్డులు సమావేశమై ఒక నిర్ణయానికి రావాలని ఏసీసీ సూచించింది. దాంతో.. త్వరలోనే బీసీసీఐ, శ్రీలంక క్రికెట్, అఫ్గన్ క్రికెట్ బోర్డు, పీసీబీల పెద్దలు సమావేశం కానున్నారు.
ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ పూర్తయ్యాక బహుమతి ప్రదాన కార్యక్రమంలో రన్నరప్ పాక్ జట్టు ఆటగాళ్లకు మొహ్సిన్ నఖ్వీ మెడల్స్ అందించాడు. అయితే.. ‘షేక్ హ్యాండ్’ ఇవ్వకపోవడాన్ని పెద్ద వివాదంగా మార్చిన అతడి నుంచి ట్రోఫీ అందుకునే ప్రసక్తే లేదని భారత క్రికెటర్లు ఏసీసీకి తెలియజేశారు.
🚨 INDIAN TEAM BOYCOTT 🚨
Presenter Simon Doull announces that Team India will not collect the Asia Cup trophy from Mohsin Naqvi.
The Men in Blue chose celebration without silverware over compromise. A bold stand that shook Dubai 🔥#AsiaCup2025 #INDvsPAK #PKMKBForever pic.twitter.com/J2ypTUiitu
— Nut Boult (@NutBoult) September 28, 2025
యూఏఈ క్రికెట్ అధ్యక్షుడి చేతుల మీదుగా తమకు ట్రోఫీ అందిస్తే బాగుంటుందని భారత ఆటగాళ్లు కోరారు. అయినా సరే.. నఖ్వీ వేదక మీద వేచి ఉన్నాడు. అతడిని పట్టించుకోకుండా టీమిండియా ప్లేయర్లు రిలాక్స్‌గా మైదానంలో ఫోన్లు చూసుకుంటూ.. కబుర్లు చెబుతూ ఉండిపోయారు. ఇదంతా చూసిన నఖ్వీ ట్రోఫీతో ఉడాయించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.