ఢిల్లీ : సోమవారం నుంచి మంగోలియాలో ప్రారంభమైన ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత బాక్సర్లు శుభారంభం చేశారు. యువ బాక్సర్ ప్రీతి పవార్‌తో పాటు దీపక్ తొలి రౌండ్ బౌట్లో తమ ప్రత్యర్థులను చిత్తుచేసి విజయాలతో రెండో రౌండ్‌కు ముందంజవేశారు.
మహిళల 54 కిలోల విభాగంలో ప్రీతి.. 5-0తో కజకిస్థాన్ బాక్సర్ ఎలీనా బజరొవను చిత్తుచేసి ఏకపక్ష విజయం సాధించింది. పురుషుల 70 కిలోల విభాగంలో దీపక్.. 3-2తో ఖవస్బెక్ అసదుల్లెవ్ (ఉజ్బెకిస్థాన్)ను ఓడించాడు.