హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : మహిళా సాధికారత, సామాజిక సేవా రంగాల్లో విశేష సేవలందిస్తున్న ప్రముఖ వైద్యురాలు అనూరాధారెడ్డి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు సాధించారు. యునైటెడ్ నేషన్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రిన్సిపల్స్ విభాగంలో నాయకత్వం, మహిళా హకులు, లింగ సమానత్వ అంశాలకు సంబంధించి ఐక్యరాజ్యసమి తి రాయబారిగా గురువారం నియమితులయ్యారు. ఆమె ఇకపై అంతర్జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించనున్నారు.
ఐక్యరాజ్యసమితి పబ్లిక్ సర్వీస్ డే సందర్భాన్ని పురసరించుకుని డాక్టర్ అనూరాధారెడ్డికి ప్రతిష్ఠాత్మకమైన ‘లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు’ప్రకటించారు. ఐరాస మహిళా సాధికారత సూత్రాల ‘హాల్ ఆఫ్ ఫేమ్” జాబితాలో కూడా ఆమెకు స్థానం కల్పించి ఘనంగా సతరించారు. సమాజ శ్రేయస్సు, మహిళాభ్యుదయం కోసం ఆమె సుదీర్ఘకాలంగా, నిరంతరాయంగా అందిస్తున్న సేవలను గుర్తించి ఐక్యరాజ్యసమితి ఈ అరుదైన గౌరవాన్ని అందించినట్టు తెలిపింది.