కదిరి కాకాజీ ఖాయమేనా?
‘మెగా లీక్స్' టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. గతంలో కూడా పలు సినీ వేడుకలకు అతిథిగా హాజరైన చిరంజీవి.. తన సినిమాలకు చెందిన అప్డేట్లను అనుకోకుండా లీక్ చేసి చర్చలకు తెరలేపారు.
‘మెగా లీక్స్’ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. గతంలో కూడా పలు సినీ వేడుకలకు అతిథిగా హాజరైన చిరంజీవి.. తన సినిమాలకు చెందిన అప్డేట్లను అనుకోకుండా లీక్ చేసి చర్చలకు తెరలేపారు. ఇవి అభిమానులకు ఆనందాన్ని ఇచ్చినా.. ప్రమోషన్ల ప్లానింగ్‌లో మార్పులు రావడం వల్ల మేకర్లు మాత్రం కాస్త ఇబ్బందిపడాల్సిన పరిస్థితి. రీసెంట్గా ‘కొరియన్ కనకరాజు’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న మెగాస్టార్.. మరోసారి నోరు జారారు.
తన ‘మెగా 158’ సినిమా టైటిల్‌ను ‘కదిరి..’ అంటూ సగం చెప్పేసి.. ‘మిగతా పదాన్ని పూర్తి చేసుకోండి..’ అన్నట్టుగా అటు అభిమానులకూ, ఇటు ప్రేక్షకులకు పరీక్ష పెట్టాడు. దాంతో కొందరు ‘కదిరి కాకాజీ’ అంటూ, మరికొందరు ‘కదిరి నరసింహ’ అంటూ ఎవరికి తోచిన టైటిల్‌ని వారు చెబుతున్నారు.
అయితే.. ఫిల్మ్ వర్గాల్లో మాత్రం ‘కదిరి కాకాజీ’ టైటిల్ బలంగానే వినిపిస్తున్నది. అసలు టైటిల్ తెలియాలంటే ఈ నెల 22 వరకూ ఆగాల్సిందే. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని, టీజర్‌ని విడుదల చేయనున్నారు. కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట కె.నారాయణ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

