Asia Cup IND Vs PAK | భారత్ – పాక్ జట్లు మరోసారి తలపడనున్నాయి. 2020 టీ20 ప్రపంచ కప్ తర్వాత ఆసియా కప్‌లో దాయాది దేశాలు పోటీపడనున్నాయి. ఆగస్టు 30న టోర్నీ ప్రారంభంకానుండగా.. మొత్తం 13 మ్యాచులు జరుగనున్నాయి. సెప్టెంబర్ 2న హైవోల్టేజ్ మ్యాచ్ భారత్ – పాక్ మధ్య జరుగనున్నది. శ్రీలంకలోని క్యాండీ వేదికగా మ్యాచ్ జరుగనున్నది. అయితే, ఆసియా కప్‌కు సంబంధించి ఇంకా అధికారిక షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను పీసీబీ సిద్ధం చేసింది. పాక్‌లోని ముల్తాన్‌లో ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్ పాక్ – నేపాల్ జట్ల మధ్య జరుగనున్నది.
సెప్టెంబర్ 17న శ్రీలంక రాజధాని కొలంబోలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్, నేపాల్‌తో పాటు పాకిస్థాన్ గ్రూప్-ఏలో ఉండగా, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్-బీలో ఉన్నాయి. ప్రతి గ్రూప్ నుంచి మొదటి రెండు జట్లు సూపర్ ఫోర్ దశకు అర్హత సాధిస్తాయి. ఇందులో తొలిస్థానంలో నిలిచిన జట్లు ఫైనల్‌కు వెళ్లనున్నాయి. ఒకే గ్రూప్‌లో భారత్ -పాక్ సూపర్ ఫోర్ చేరితే మరోసారి సెప్టెంబర్ 10న క్యాండీ వేదికగా తలపడే అవకాశం ఉండనున్నది.
ఇక ఈసారి ఆసియా కప్ 50 ఓవర్ల ఫార్మాట్లో జరుగనున్నది. తొలి మ్యాచ్ పాకిస్థాన్‌లోని ముల్తాన్‌లో జరుగనున్నది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న కొలంబోలో జరగనుంది. సెప్టెంబర్ 3న లాహోర్‌లో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, సెప్టెంబర్ 5న శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడనున్నాయి. టోర్నీలో మొత్తం 13 మ్యాచులు జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం.. మ్యాచ్‌లు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభంకానున్నాయి. ఈ సారి ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో జరుగనుండగా.. అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే వన్డే ప్రపంచ కప్‌కు సన్నహాంగా ఆసియాకప్ ఉపయోగపడనున్నది.