Asia Cup | ఆసియా కప్ టోర్నీ వచ్చే నెలలో మొదలుకానున్నది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు టీ20 ఫార్మాట్లో జరుగనుండగా.. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే హైవోల్టేజ్ మ్యాచ్ కోసం నిరీక్షిస్తున్నారు. టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్‌లో జరగనుంది. అయితే, భారత జట్టు ఈ మ్యాచ్ ఆడుతుందో.. లేదో ఇంకా స్పష్టత రాలేదు. అదే సమయంలో, సెప్టెంబర్ 10న యుఏఈతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. 2008 తర్వాత భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేరు లేకపోవడం ఇదే మొదటిసారి. 17 సంవత్సరాల తర్వాత వారిద్దరు లేకుండానే జట్టు ఈ టోర్నమెంట్ ఆడనుంది. 2008 నుంచి ఇప్పటి వరకు భారత జట్టు ఎంతగా మారిపోయిందో ఓ లుక్కేద్దాం రండి..!
2008లో ఆడిన ఆసియా కప్‌లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్‌గా ఉన్నాడు. ఇది రోహిత్ శర్మకు తొలి ఆసియా కప్. ఆ ఎడిషన్‌లో విరాట్ జట్టులో లేడు. యువరాజ్ సింగ్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. వన్డే ఫార్మాట్లో ఆడిన ఆ ఎడిషన్‌లో, టీమ్ ఇండియా ఫైనల్‌కు చేరుకుంది. అయితే, శ్రీలంక చేతిలో 100 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 2010లో వన్డే ఫార్మాట్లో ఆడిన ఆసియా కప్‌కు కూడా ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఆ ఎడిషన్‌లో జట్టులో ఉన్నారు. అయితే, జట్టుకు ఎవరినీ వైస్ కెప్టెన్‌గా నియమించలేదు. 2010లో ఫైనల్లో శ్రీలంకను 81 పరుగుల తేడాతో ఓడించి భారత జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. 2012లో వన్డే ఫార్మాట్లో ఆడిన ఆసియా కప్‌లో ధోనీ కెప్టెన్‌గా ఉన్నాడు. విరాట్ కోహ్లీకి వైస్ కెప్టెన్సీ బాధ్యత అప్పగించారు. రోహిత్ శర్మ కూడా జట్టులో ఉన్నాడు. 2012లో సెమీ-ఫైనల్స్‌లో ఓడిపోవడంతో భారత జట్టు ఎలిమినేట్ అయ్యింది. ఫైనల్లో బంగ్లాదేశ్‌ను రెండు పరుగుల తేడాతో ఓడించి పాక్ టైటిల్ గెలిచింది.
2008 | 2010 | 2012 |
---|---|---|
మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్) | మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్) | మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్) |
యువరాజ్ సింగ్ | గౌతమ్ గంభీర్ | విరాట్ కోహ్లీ (వైస్ కెప్టెన్) |
గౌతమ్ గంభీర్ | దినేష్ కార్తీక్ | గౌతమ్ గంభీర్ |
వీరేంద్ర సెహ్వాగ్ | విరాట్ కోహ్లీ | సచిన్ టెండూల్కర్ |
రోహిత్ శర్మ | సురేశ్ రైనా | సురేశ్ రైనా |
రాబిన్ ఉత్తప్ప | రోహిత్ శర్మ | రోహిత్ శర్మ |
సురేశ్ రైనా | సౌరభ్ తివారి | మనోజ్ తివారి |
ఇర్ఫాన్ పఠాన్ | రవిచంద్రన్ అశ్విన్ | రవిచంద్రన్ అశ్విన్ |
యూసుఫ్ పఠాన్ | రవీంద్ర జడేజా | రవీంద్ర జడేజా |
పియూష్ చావ్లా | అశిష్ నెహ్రా | ఇర్ఫాన్ పఠాన్ |
ప్రగ్యాన్ ఓజా | హర్భజన్ సింగ్ | యూసుఫ్ పఠాన్ |
మన్‌ప్రీత్ గోనీ | జహీర్ ఖాన్ | అశోక్ దిండా |
ప్రవీణ్ కుమార్ | ప్రవీణ్ కుమార్ | ప్రవీణ్ కుమార్ |
ఇషాంత్ శర్మ | ప్రగ్యాన్ ఓజా | రాహుల్ శర్మ |
ఆర్. పి. సింగ్ | అశోక్ దిండా | వినయ్ కుమార్ |
శ్రీశాంత్ (విత్‌డ్రాన్) | వీరేంద్ర సెహ్వాగ్ (విత్‌డ్రాన్) | — |
2014లో వన్డే ఫార్మాట్లో ఆడిన ఆసియా కప్‌కు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. రోహిత్ శర్మ కూడా ఆ జట్టులో ఉన్నాడు. 2014లో కూడా భారత జట్టు సెమీఫైనల్స్ లో ఓడిపోయింది. ఆ తర్వాత ఫైనల్లో శ్రీలంక పాకిస్తాన్ ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ గెలుచుకుంది. 2016లో ఆసియా కప్ ను తొలిసారి టీ20 ఫార్మాట్ లో నిర్వహించారు. కెప్టెన్‌గా ధోనీ చివరి ఆసియా కప్ ఇది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ జట్టులో ఉన్నారు. భారత జట్టు ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్ లో బంగ్లాదేశ్ ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ గెలుచుకుంది. 2017 ప్రారంభంలో పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీ నుంచి ధోనీ వైదొలిగిన తర్వాత విరాట్ కెప్టెన్ అయ్యాడు. అయితే, 2018 ఆసియా కప్‌కు ముందు ఏదో కారణం చేత తన పేరును ఉపసంహరించుకున్నాడు. ఈ పరిస్థితుల్లో రోహిత్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో శిఖర్ ధావన్ వైస్ కెప్టెన్ గా నియమితుడయ్యాడు. ఆ జట్టులో ధోనీ వికెట్ కీపర్‌గా ఉన్నాడు. వన్డే ఫార్మాట్ లో ఆడిన ఆ ఎడిషన్ ను భారత్ గెలుచుకుంది. ఫైనల్లో రోహిత్ నేతృత్వంలోని జట్టు బంగ్లాదేశ్ ను మూడు వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ గెలుచుకుంది.
2014 | 2016 | 2018 |
---|---|---|
విరాట్ కోహ్లీ (కెప్టెన్) | మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్) | రోహిత్ శర్మ (కెప్టెన్) |
శిఖర్ ధవన్ | శిఖర్ ధవన్ | శిఖర్ ధవన్ (వైస్ కెప్టెన్) |
దినేష్ కార్తీక్ | విరాట్ కోహ్లీ | ఎం.ఎస్. ధోనీ |
చేతేశ్వర్ పుజారా | పార్థివ్ పటేల్ | దినేష్ కార్తీక్ |
అజింక్య రహానే | అజింక్య రహానే | మనీష్ పాండే |
అంబటి రాయుడు | సురేశ్ రైనా | కేఎల్ రాహుల్ |
రోహిత్ శర్మ | రోహిత్ శర్మ | అంబటి రాయుడు |
ఎం.ఎస్. ధోనీ (విత్‌డ్రాన్) | యువరాజ్ సింగ్ | రవీంద్ర జడేజా |
రవిచంద్రన్ అశ్విన్ | రవిచంద్రన్ అశ్విన్ | కేదార్ జాధవ్ |
స్టువర్ట్ బిన్నీ | రవీంద్ర జడేజా | హార్దిక్ పాండ్యా (విత్‌డ్రాన్) |
వరుణ్ ఆరోన్ | హార్దిక్ పాండ్యా | అక్షర్ పటేల్ (విత్‌డ్రాన్) |
భువనేశ్వర్ కుమార్ | జస్ప్రీత్ బుమ్రా | ఖలీల్ అహ్మద్ |
అమిత్ మిశ్రా | హర్భజన్ సింగ్ | జస్ప్రీత్ బుమ్రా |
మహ్మద్ షమీ | భువనేశ్వర్ కుమార్ | యుజ్వేంద్ర చాహల్ |
ఇశ్వర్ పాండే | పవన్ నెగి | దీపక్ చహర్ |
— | అశిష్ నెహ్రా | సిద్ధార్థ కౌల్ |
— | మహ్మద్ షమీ (విత్‌డ్రాన్) | కుల్దీప్ యాదవ్ |
— | — | భువనేశ్వర్ కుమార్ |
— | — | శార్దూల్ ఠాకూర్ (విత్‌డ్రాన్) |
2022లో ఈ టోర్నమెంట్‌ని మళ్ళీ టీ20 ఫార్మాట్ లో నిర్వహించారు. ధోని రిటైర్ అయ్యాడు. విరాట్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అలాంటి పరిస్థితిలో రోహిత్ నాయకత్వంలో టీం ఇండియా ఈ టోర్నమెంట్లోకి ప్రవేశించింది. అదే సమయంలో కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఈ ఎడిషన్‌లో విరాట్ కూడా జట్టులో భాగమయ్యాడు. అయితే, సెమీ-ఫైనల్స్‌లో ఓడిపోయిన తర్వాత భారత జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఫైనల్లో, శ్రీలంక 23 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. 2023లో ఈ ఫార్మాట్‌ను మరోసారి వన్డే ఫార్మాట్లో ఆడారు. రోహిత్ జట్టుకు కెప్టెన్‌గా ఉండగా, విరాట్ కూడా జట్టులో భాగంగా ఉన్నాడు. భారత జట్టు టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో శ్రీలంకను 10 వికెట్ల తేడాతో ఓడించింది. ఇక 2025లో ఈ టోర్నీని టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. రోహిత్, విరాట్ ఇద్దరూ ఇప్పటికే టీ20 ఇంటర్నేషనల్ నుంచి రిటైర్ అయిన విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ ఈ ఎడిషన్‌లో జట్టును నడిపించనున్నాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ దృష్ట్యా ఈ టోర్నమెంట్ భారత్‌కు కీలకమైంది.
2022 | 2023 | 2025 |
---|---|---|
రోహిత్ శర్మ (కెప్టెన్) | రోహిత్ శర్మ (కెప్టెన్) | సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్) |
కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్) | ఇషాన్ కిషన్ | శుభ్‌మన్ గిల్ |
దినేష్ కార్తీక్ | శ్రేయస్ అయ్యర్ | అభిషేక్ శర్మ |
విరాట్ కోహ్లీ | విరాట్ కోహ్లీ | తిలక్ వర్మ |
రిషబ్ పంత్ | కేఎల్ రాహుల్ | హార్దిక్ పాండ్యా |
సూర్యకుమార్ యాదవ్ | శుభ్‌మన్ గిల్ | శివమ్ దూబే |
రవిచంద్రన్ అశ్విన్ | సూర్యకుమార్ యాదవ్ | జితేశ్ శర్మ |
దీపక్ హుడా | రవీంద్ర జడేజా | అక్షర్ పటేల్ |
హార్దిక్ పాండ్యా | హార్దిక్ పాండ్యా | జస్ప్రీత్ బుమ్రా |
అక్షర్ పటేల్ | తిలక్ వర్మ | వరుణ్ చక్రవర్తి |
రవీంద్ర జడేజా (విత్‌డ్రాన్) | వాషింగ్టన్ సుందర్ | అర్షదీప్ సింగ్ |
అర్షదీప్ సింగ్ | అక్షర్ పటేల్ (విత్‌డ్రాన్) | కుల్దీప్ యాదవ్ |
యుజ్వేంద్ర చాహల్ | జస్ప్రీత్ బుమ్రా | సంజు శాంసన్ |
దీపక్ చహర్ | కుల్దీప్ యాదవ్ | హర్షిత్ రాణా |
భువనేశ్వర్ కుమార్ | మహ్మద్ షమీ | రింకూ సింగ్ |
రవీ బిష్ణోయ్ | మహ్మద్ సిరాజ్ | — |
ఆవేష్ ఖాన్ (విత్‌డ్రాన్) | ఫేమస్ కృష్ణ | — |
— | శార్దూల్ ఠాకూర్ | — |