TNPL 2024 : తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL 2024)లో కొత్త చాంపియన్ పుట్టుకొచ్చింది. ఎనిమిదేండ్ల కలను నిజం చేసుకుంటూ దిండిగుల్ డ్రాగన్స్ (Dindigul Dragons) తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. చిదంబరం స్టేడియంలో జరిగిన ఫైనల్లో లైకా కొవాయ్ కింగ్స్(Lyca Kovai Kings)పై అద్భుత విజయంతో ట్రోఫీని ముద్దాడింది. స్వల్ప ఛేదనలో డ్రాగన్స్ సారథి రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్(52) అర్ధ శతకంతో విరుచుకుపడ్డాడు. బాబా ఇంద్రజిత్(32), శరత్ కుమార్(27 నాటౌట్)లు సైతం రాణించడంతో 6 వికెట్ల తేడాతో అశ్విన్ బృందం జయభేరి మోగించింది.
టీఎన్‌పీఎల్ 2024 ఎడిషన్‌లో అదరగొట్టిన దిండిగుల్ డ్రాగన్స్ ఫైనల్లోనూ దుమ్మురేపింది. అశ్విన్ సారథ్యంలోని డ్రాగన్స్ తొలుత డిఫెండింగ్ చాంపియన్ లైకా కొవాయ్ కింగ్స్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. ఆపై 18.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ట్రోఫీని అందుకుంది.
😁 Happy faces all around!#LKKvDD #NammaOoruAattam #TNPL2024 #NammaOoruNammaGethu pic.twitter.com/GOqa9ZqIvN
— TNPL (@TNPremierLeague) August 4, 2024
టైటిల్ పోరులో కొవాయ్ ఇన్నింగ్స్ ఆది నుంచి తడబడుతూనే సాగింది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (2/26), పీ విఘ్నేశ్(2/15)ల విజృంభణతో కొవాయ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఓపెనర్ సుజయ్(22), మిడిలార్డర్లో రామ్ అర్వింద్(27), అథీక్ ఉర్ రెహ్మాన్(25)లు కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. దాంతో, కొవాయ్ కింగ్స్ నిర్ణీత ఓవరల్లో7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది.
A new addition to the coveted list of TNPL champions – @DindigulDragons! 👏🏆#LKKvDD #NammaOoruAattam #TNPL2024 #NammaOoruNammaGethu pic.twitter.com/5n2XYeY2fS
— TNPL (@TNPremierLeague) August 4, 2024
అనంతరం స్వల్ప ఛేదనలో డ్రాగన్స్ జట్టు 23 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ దశలో కెప్టెన్ అశ్విన్(52), బాబా ఇంద్రజిత్(32)తో కలిసి స్కోర్ బోర్డును నడిపించాడు. జట్టు స్కోర్ 121 వద్ద ఔటయ్యాడు. అప్పటికే డ్రాగన్స్ విజయం ఖరారైపోయింది. ఆ తర్వాత శరత్ కుమార్(27 నాటౌట్), భూపతి కుమార్(3 నాటౌట్)లు లాంఛనం ముగించారు. దాంతో, తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో మొదటిసారి డ్రాగన్స్ జట్టు విజేతగా అవతరించింది.