IPL 2025 : ప్రతి ఐపీఎల్లో సీజన్లో కొందరు ఆటగాళ్లు సంచలన ప్రదర్శనతో ఔరా అనిపిస్తుంటారు. గత 17 సీజన్లలో ఎందరో కుర్రాళ్లు తమ అసమాన ప్రతిభతో ప్రశంసలు అందుకున్నారు. నరాలు తెగే ఉత్కంఠ నెలకొన్న మ్యాచ్‌లో ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా వీరోచిత అర్ధ శతకం బాది.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను గెలిపించిన అశుతోష్ శర్మ(Ashutosh Sharma) ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఐపీఎల్‌గా మారిన ఈ కుర్రాడు ఒంటిచేత్తో ఢిల్లీని విజయ తీరాలకు చేర్చిన తీరుకు మాజీ క్రికెటర్లు ఫిదా అవుతున్నారు. గత సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఫినిషర్‌గా చెలరేగి ఆడిన అశతోష్.. ఇప్పుడు ఢిల్లీకి మారినా తనలో చేవ మాత్రం తగ్గలేదని అంటున్నాడు.
లక్నోపై ఇన్నింగ్స్‌ను ఎంతగానో ఆస్వాదించాను. ఆ మ్యాచ్‌లో నేను కొత్తగా చేసిందేమీ లేదు. బేసిక్స్ పాటించానంతే. ఒక్కో బంతి మీద దృష్టి సారించాను. డెత్ ఓవర్లలో భారీ షాట్లు ఆడగలనని నాకు తెలుసు. ఓవైపు వికెట్లు పడుతున్నాచివరి వరకూ క్రీజులో ఉండేందుకు ప్రయత్నించాను. గత సీజన్ కూడా గొప్ప ప్రదర్శన చేశాను. అయితే.. అదంతా గతం. ఇప్పుడు నా దృష్టంతా ఫినిషర్‌గా రాణించడం మీదనే ఉంది. 17వ సీజన్ నుంచి ఎన్నో సానుకూల అంశాలు అలవర్చుకున్నా. నా ఫుట్‌వర్క్ మరింత మెరుగుపరచుకున్నా. బలహీనతలపై ఫోకస్ పెట్టాను. దేశవాళీ క్రికెట్లో దూకుడుగా ఆడినట్టే ఇక్కడా ఆడుతున్నా అని చెప్పాడు అశుతోష్.
Close finish ✅
Safe to say, the #DC dugout was a bunch of emotions in those last couple of overs of a nail-biter! 😦 ☺
𝗥𝗮𝘄 𝗩𝗶𝘀𝘂𝗮𝗹𝘀! 🎥 🔽 #TATAIPL | #DCvLSG | @DelhiCapitals pic.twitter.com/0EIdIQ7VTt
— IndianPremierLeague (@IPL) March 25, 2025
‘విశాఖపట్టణంలో తన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లో మెంటర్ కెవిన్ పీటర్స్ పాత్ర ఉందని మ్యాచ్ అనంతరం వెల్లడించాడీ డాషింగ్ బ్యాటర్. కెప్టెన్ అక్షర్ పటేల్, ఢిల్లీ కోచింగ్ సిబ్బంది నాపై ఎంతో నమ్మకం ఉంచారు. లోయర్ ఆర్డర్లో ఎలా ఆడాలి? అనే విషయంపై నాకు స్పష్టత ఇచ్చారు. ఇక మెంటర్ కెవిన్ పీటర్సన్(Kevin Pietersen) తాను ఇంగ్లండ్‌ను గెలిపించిన తీరును వివరిస్తూ నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు. ఆయన సలహాలతో లక్నోపై చెలరేగిపోయాను. నా ప్రదర్శన పట్ల జట్టులోని ప్రతి ఒక్కరూ, మా యాజమాన్యం చాలా సంతోషంగా ఉంది. తదుపరి మ్యాచుల్లోనే ఇదే తరహాలో ఆడాలని అనుకుంటున్నా’ అని వివరించాడీ మ్యాచ్ విన్నర్.
ఐపీఎల్ 18వ సీజన్లో తొలి మ్యాచ్‌లోనే ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడాడు అశుతోష్.. 209 పరుగుల ఛేదనలో లక్నో బౌలర్ల ధాటికి అందరూ డగౌట్ చేరినా.. ఓటమి అంచున నిలిచిన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. ఫినిషర్ అంటే తన మాదిరిగా ఆడాలి మరోసారి ప్రపంచానికి చాటాడీ యంగ్‌స్టర్. అతడు క్రీజులోకి వచ్చేసరికి స్కోర్.. 50-4. ఆ దశలో ఢిల్లీ పరాజయం పాలవ్వడం అనుకున్నారంతా. కానీ, ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్‌లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు అశుతోష్.. చిరస్మరణీయ విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. 33 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు బాది అజేయ అర్థ శతకంతో జట్టును గెలిపించి.. విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడడంలో తాను దిట్ట అని మరోసారి నిరూపించుకున్నాడు అశుతోష్. 17వ సీజన్లో 9 మ్యాచుల్లో.. 167 స్ట్రైక్ రేటుతో 189 పరుగులు చేశాడు. అదే జోరును ఈ ఎడిషన్‌లోనూ కొనసాగిస్తున్నాడీ హిట్టర్.
Fearless ✅
Courageous ✅For his 𝙍𝙤𝙖𝙧𝙞𝙣𝙜 game-changing knock, Ashutosh Sharma bags the Player of the Match award 🏆💙
Scorecard ▶ https://t.co/aHUCFODDQL#TATAIPL | #DCvLSG | @DelhiCapitals pic.twitter.com/jHCwFUCvP5
— IndianPremierLeague (@IPL) March 24, 2025