మిర్యాలగూడ, మార్చి 25 : హైదరాబాద్ చంపాపేటకు చెందిన న్యాయవాది ఇజ్రాయెల్‌ను కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం మిర్యాలగూడ బార్ అసోసియేషన్ సభ్యులు విధులు బహిష్కరించి కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వేలాద్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలన్నారు. అనంతరం మౌనం పాటించారు.
ఈ కార్యక్రమంలో బార్ వైస్ ప్రెసిడెంట్ ఎండి.ఇబ్రహీం, ట్రెజరరీ పవన్‌కుమార్, సీనియర్ న్యాయవాదులు కె.శ్రీనివాస్‌రెడ్డి, రమణరెడ్డి, కొంక వెంకన్న, జిన్నా, శ్రీను, లింగంపల్లి శ్రీను, సాయి, భాస్కర్, వేణు, మండ సైదులు, మట్టయ్య రాజేశ్, మస్తాన్, కె.నాగేందర్ పాల్గొన్నారు.