Aryna Sabalenka : ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ అరినా సబలెంక(Aryna Sabalenka) తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆమె బాయ్‌ఫ్రెండ్ కొన్‌స్టాంటిన్ కొల్త్సోవ్(Konstantin Koltsov) మరణించాడు. మాజీ ప్రో ఐస్ హాకీ(PIH) ఆటగాడైన కొన్‌స్టాంటిన్ 42 ఏండ్ల వయసులో అకాల మరణం చెందాడు. అమెరికాలో ఉంటున్న అతడు హఠాన్మరణం చెందాడని రష్యాకు చెందిన ఐస్ హాకీ క్లబ్ సలావత్ యులీవ్(Salavat Yulaev) మంగళవారం వెల్లడించింది. అయితే.. కొన్‌స్టాంటిన్ చనిపోవడానికి కారణాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. దాంతో, అతడిది అనుమానాస్పద మృతిగా భావిస్తున్నారు.
‘సలావత్ యులీవ్ క్లబ్లో విషాదం నెలకొంది. కోచ్ కొన్‌స్టాంటిన్ చనిపోయాడు. అతడు ఎంతో హుషారుగా ఉండేవాడు. ఆటగాళ్లు, అభిమానులు అతడిని ఎంతగానో అభిమానించేవాళ్లు. మా క్లబ్ చరిత్రలో కొన్‌స్టాంటిన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాం’ అని సలావత్ యులీవ్ క్లబ్ ఓ ప్రకటన విడుదల చేసింది.
Hockey club Salavat Yulaev confirms Konstantin Koltsov’s death.https://t.co/JzCQ5IiuSk pic.twitter.com/RhO3arfYo5
— Belarushockey.com (@Belarushockey) March 19, 2024
గ్రాండ్‌స్లామ్ విజేత సబలెంక, కొన్స్టాంటిన్లు 2021 నుంచి ప్రేమలో ఉన్నారు. పలు సందర్భాల్లో ఇద్దరూ కెమెరా
కంట పడ్డారు. త్వరలోనే పెండ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ, ఇంతలోపే విధి మృత్యువు రూపంలో కొన్స్టాంటిన్ను బలిగొన్నది. బెలారస్ జాతీయ జట్టుకు కొన్‌స్టాంటిన్ 8 ఏండ్లు ప్రాతినిధ్యం వహించాడు. 2002 నుంచి 2010 ఒలింపిక్స్ వరకు ప్రో ఐస్ హాకీ ఆడాడు. అంతేకాదు సలావత్ యులీవ్ క్లబ్ తరఫున రష్యన్ సూపర్ లీగ్‌లో టైటిళ్లు కూడా గెలిచాడు. ఆ తర్వాత అదే క్లబ్లో కొన్‌స్టాంటిన్ అసిస్టెంట్ కోచ్‌గా సేవలందించాడు.
కొన్‌స్టాంటిన్, సబలెంక
బెలారస్ స్టార్ సబలెంక కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించింది. డిఫెండింగ్ చాంపియన్‌గా ఆస్ట్రేలియన్ ఓపెన్(Australia Open 2024)లో అడుగుపెట్టిన ఆమె వరుసగా రెండో ఏడాది టైటిల్ నిలబెట్టుకొని చరిత్ర సృష్టించింది. ఇండియన్ వెల్స్ టోర్నీలో 16వ రౌండ్లోనే వెనుదిరిగింది. తర్వాత జరుగబోయే ఇంటర్ మియామి టోర్నమెంట్లో సబలెంక బరిలోకి దిగనుంది.