లియోనల్ మెస్సీ..ఫుట్‌బాల్ ప్రేమికులకు పరిచయం అక్కరలేని పేరు. ఆట కోసమే పుట్టాడా అన్న రీతిలో మరోమారు తన అద్భుత ఆటతీరుతో మాయ చేశాడు. మూడున్నర దశాబ్దాల అర్జెంటీనా సుదీర్ఘ కలను సాకారం చేసేందుకు మెస్సీ తనదైన రీతిలో సత్తాచాటాడు. సౌదీఅరేబియా చేతిలో అనూహ్య ఓటమి మినహా వరుస విజయాలతో దూసుకెళుతున్న మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా ఆరోసారి ఫైనల్ ఫైట్‌కు అర్హత సాధించింది. పోరాటాన్ని అణువణువున ఒంటపట్టించుకుంటూ మేటి జట్లకు షాక్ ఇచ్చిన క్రొయేషియా జోరుకు అర్జెంటీనా బ్రేక్‌లు వేసింది.
కండరాల నొప్పితో అసలు బరిలోకి దిగుతాడా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ మెస్సీ మాయ చేశాడు. పెట్టని కోటలాంటి క్రొయేషియా డిఫెన్స్‌ను కకావికలు చేస్తూ యువ స్ట్రైకర్ అల్వరెజ్తో కలిసి అర్జెంటీనాకు మెస్సీ చిరస్మరణీయ విజయాన్నందించాడు. మెగాటోర్నీలో అర్జెంటీనా తరఫున అత్యధిక గోల్స్‌తో పాటు పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఆదివారం జరిగే ఫిఫా ఫైనల్ సంగ్రామంలో ఫ్రాన్స్ లేదా మొరాకోతో అర్జెంటీనా తలపడుతుంది.
లుసైల్(ఖతార్): అర్జెంటీనా అద్భుతం చేసింది. వరుస విజయాల(36)తో ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన అర్జెంటీనా..సౌదీ అరేబియా చేతిలో అనూహ్య ఓటమి ఎదుర్కొంది. ఊహించని ఓటమి నుంచి తొందరగానే తేరుకున్న మెస్సీ సేన మళ్లీ వెనుదిరిగి చూడలేదు. కెరీర్ చరమాంకంలో ఉన్న 35 ఏండ్ల మెస్సీ సహచరుల్లో స్ఫూర్తినింపడంతో అర్జెంటీనాకు ఎదురులేకుండాపోయింది. వరుస మ్యాచ్‌ల్లో విజయాలతో ఆరోసారి ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. క్రొయేషియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0 తేడాతో అద్భుత విజయం సాధించింది. కెప్టెన్ మెస్సీ(34ని), జులియన్ అల్వరెజ్(39ని, 69ని) గోల్స్ చేశారు. మ్యాచ్‌కు వేదికైన లుసైల్ స్టేడియం రికార్డు స్థాయిలో 88,966 మంది ప్రేక్షకులతో నిండిపోయింది. ఫ్రాన్స్, మొరాకో మధ్య జరిగే మరో సెమీస్ మ్యాచ్ విజేతతో ఈనెల 18న అర్జెంటీనా తలపడుతుంది.
మెస్సీ మాయ:
మ్యాచ్ ముందు వరకు మెస్సీ ఆడుతాడా లేదా అన్నది అనుమానంగా మారిన క్షణాన ప్రతీ అభిమాని మదిలో సందేహం. తమ అభిమాన ఆటగాడి ప్రస్థానం ఇక్కడితోనే ఆగిపోతుందా అని. కానీ ఇక్కడే అదృష్టం అర్జెంటీనా వైపు నిలిచింది. అందరి అనుమానాలను తలకింద్రులు చేస్తూ క్రొయేషియాతో సెమీస్ పోరుకు మెస్సీ సై అన్నాడు. మెస్సీ ఉంటే తమకు వెయ్యి ఏనుగుల బలమని భావించే సహచర ప్లేయర్లు ఓవైపు అయితే చూసే ఒళ్లంతా కండ్లు చేసుకొని చూసే అభిమానులు మరోవైపు మ్యాచ్ మొదలైన నిమిషం నుంచి క్రొయేషియా గోల్‌పోస్ట్ లక్ష్యంగా అర్జెంటీనా మెరుపు దాడులకు పూనుకుంది.
ఈ క్రమంలో పటిష్ఠ డిఫెన్స్ కల్గిన క్రొయేషియాను ఎదుర్కొనేందుకు అర్జెంటీనా కోచ్ లియోనల్ స్కాలోనీ రచించిన ప్రణాళికను ప్లేయర్లు మైదానంలో చేసి చూపెట్టారు. మ్యాచ్ 34వ నిమిషంలో సహచరుల నుంచి పాస్ అందుకున్న అల్వరెజ్ మెరుపు వేగంతో క్రొయేషియా పోస్ట్ వైపు పరుగు అందుకున్నాడు. ఒకింత తొందరపడ్డ క్రొయేషియా గోల్‌కీపర్ లివాకోవిచ్ దురుసుగా అడ్డుకోవడంతో రిఫరీ అర్జెంటీనాకు పెనాల్టీ కేటాయించాడు. ఇంకేముంది వచ్చిన అవకాశాన్ని మెస్సీ తనదైన శైలిలో గోల్‌కొట్టి అర్జెంటీనాకు అదిరిపోయే బోణీ కొట్టాడు.
బంతి దొరకడమే ఆలస్యం..దాని లక్ష్యం గోల్‌పోస్ట్ అన్న తరహాలో చెలరేగింది. అయిదు నిమిషాల తేడాతో మెస్సీ అందించిన పాస్‌ను అల్వరెజ్ గోల్‌గా మలువడంతో అర్జెంటీనా ఆధిక్యం 2-0కు చేరుకుంది. ఖాతా తెరిచేందుకు క్రొయేషియా ఎన్నిసార్లు ప్రయత్నించినా సఫలం కాలేకపోయింది. కీలకమైన ద్వితీయార్ధంలోనూ పట్టుసడలని అర్జెంటీనా తమ ఆధిక్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించింది. ఓవైపు దాడులకు వ్యుహాలు రచిస్తూనే..మరోవైపు దుర్భేద్యమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థి ప్రయత్నాలను నిలువరించింది. మ్యాచ్ 69వ నిమిషంలో మెస్సీ చేసిన మ్యాజిక్ చూసి వారెవ్వా అనాల్సిందే.
టోర్నీలో మేటి డిఫెండర్లలో ఒకడిగా కొనసాగుతున్న జాస్కో గ్వాడ్రియోల్ను కంగుతినిపిస్తూ మెస్సీ బంతితో చేసిన విన్యాసం ప్రతీ అభిమానికి చిరకాలం గుర్తుంటుంది. పెనాల్టీ ఏరియాలో మెస్సీ అందించిన పాస్‌ను అక్కడే కాచుకొని ఉన్న అల్వరెజ్ క్షణకాలంలో గోల్ కొట్టి అర్జెంటీనాను గెలుపు సంబురాల్లో ముంచెత్తాడు. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా ఊగిపోయింది. మొత్తంగా అర్జెంటీనా చేసిన మూడు గోల్స్‌లో మెస్సీదే కీలక పాత్ర కావడం విశేషం.
ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌తో నా కెరీర్‌ను ముగించాలనుకుంటున్నాను. ఇది మరిచిపోలేని జ్ఞాపకం. ఈ మెగాటోర్నీలో ప్రతీ మ్యాచ్ భావోద్వేగమైనదే. అర్జెంటీనాలో అభిమానులు మా ఆటను ఎంతగా ఆస్వాదిస్తున్నారో చూస్తున్నాం. కెరీర్‌ను ఇలా ముగించడం చాలా బాగుంది.
– లియోనల్ మెస్సీ
అర్జెంటీనా తరఫున ప్రపంచ కప్ గోల్స్
లియోనల్ మెస్సీ 11
గాబ్రియల్ బటిస్టా 10
డీగో మారడోనా 8
గులియెమో స్టాబిల్ 8
మారియో కెంపెస్ 6
1కెప్టెన్‌గా అత్యధిక ప్రపంచకప్ మ్యాచ్లాడినవారిలో మెస్సీ(18) టాప్‌లో ఉండగా, రఫామార్కెజ్ (17), మారడోనా(16) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు.
5కెరీర్లో ఐదు ప్రపంచకప్ టోర్నీలు ఆడిన వారిలో మెస్సీతో పాటు అంటానియో
కార్బజల్, లోథార్ మథౌస్, రఫా మార్కెజ్, అండ్రెస్ గెరార్డో, రొనాల్డో ఉన్నా