యోచియాన్(దక్షిణకొరియా): ప్రతిష్ఠాత్మక ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2లో భారత మహిళల కాంపౌండ్ టీమ్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో జ్యోతిసురేఖ, పర్నీత్కౌర్, అదితిస్వామితో కూడిన భారత త్రయం 233-229 తేడాతో అమెరికాపై అద్భుత విజయం సాధించింది. శనివారం టర్కీతో జరిగే ఫైనల్లో భారత్ తలపడుతుంది. మరోవైపు పురుషుల కాంపౌండ్ టీమ్ కాంస్య పోరులో ఆస్ట్రేలియా చేతిలో ప్రియాంశ్, పార్థమేశ్, అభిషేక్ త్రయం పోరాడి ఓడింది.