Vinesh Phogat : విశ్వ క్రీడల్లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ (Vinesh Phogat)కు వెండి పతకంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడలేదు. శనివారం వినేశ్ అనర్హతపై విచారణ చేపట్టిన స్పోర్ట్స్ అర్బిట్రేషన్ కోర్టు(CAS) తీర్పును ఆగస్టు 13కు వాయిదా వేసింది. ఒలింపిక్స్ ముగింపు వేడుల రోజు సాయంత్రం ఏదో ఒకటి తేల్చేస్తామని చెప్పింది.
సీఏఎస్ అడ్‌హక్ కమిటీ ఆగస్టు 11 సాయంత్రం 6 గంటలకు తీర్పును వెలువరించనుంది. వినేశ్ ఫోగట్ వర్సెస్ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కేసులో అర్బిట్రేటర్ డాక్టర్ అన్నబెల్లే బెన్నెట్ నిర్ణయం తీసుకోనున్నారు అని సీఏఎస్ వెల్లడించింది.
The verdict of Vinesh Phogat pic.twitter.com/aMYh7s5KmL
— RVCJ Media (@RVCJ_FB) August 10, 2024
పారిస్ ఒలింపిక్స్ ఫైనల్ ముందు తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ వినేశ్ ఫోగట్ ఆగస్టు 7 బుధవారం అర్బిట్రేషన్ కోర్టుకు అప్పీల్ చేసింది. గురువారం సదరు కోర్టు భారత రెజ్లర్ వినతిని స్వీకరించింది. వినేశ్ తరఫున వాదనలు వినిపించేందుకు భారత ప్రభుత్వ మాజీ సొలిసిటర్ జనరల్ హరిష్ సాల్వే (Harish Salve) సైతం సిద్దమయ్యారు. కానీ, అర్బిట్రేషన్ కోర్టు తీర్పును ఆగస్టు 13 మంగళవారానికి వాయిదా వేసింది.
ఒలింపిక్స్ 50 కిలోల విభాగంలో ఫైనల్ చేరిన వినేశ్ ఫోగట్‌కు బుధవారం ఊహించని షాక్ తగిలింది.100 గ్రాముల అదనపు బరువు కారణంగా నిర్వాహకులు ఆమెను అనర్హురాలిగా ప్రకటించారు. దాంతో, భారమైన హృదయంతో ఆమె రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికింది. అనంతరం అడ్ హక్ ప్యానెల్ క్రీడా కోర్టులో తనకు న్యాయం చేయాలని, గురువారం జరుగబోయే ఫైనల్లో తనను అనుమతించాలని అప్పీల్ చేసింది. కానీ, సదరు కోర్టు ఆలస్యంగా స్పందించింది. సీఏసీ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ. క్రీడలకు సంబంధించిన వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరిస్తుంటుంది.
భారత మాజీ సొలిసిటర్ జనరల్ అయిన హరిష్ సాల్వే భారత్‌లో పేరు మోసిన లాయర్. హై ప్రొఫైల్ కేసులకు ఆయన కేరాఫ్. పలువురు ప్రముఖుల కేసులను వాదించిన అనుభవం ఆయనకు ఉంది. అంతర్జాతీయ కోర్టులో భారత నేవీ అధికారి కుల్దీప్ జాదవ్ కేసును హరిష్ సమర్ధంగా వాదన వినిపించారు. సైరస్ మిస్త్రీ – రతన్ టాటా కేసులో ఈ న్యాయకోవిదుడు టాటా తరఫున పోరాడాడు. అంతేకాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి – హేమ్రాజ్ జంట హత్యల కేసుకు డిఫెన్స్ అటార్నీగా హరిష్ వ్యవహరించారు.