న్యూఢిల్లీ: వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. స్టార్ షూటర్ రెండు పసిడి పతకాలతో సత్తాచాటిన ఈ విద్యాలయ క్రీడల్లో ఆదివారం.. ఆర్చర్లు అదరగొట్టారు. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో అమన్ సింగ్-ప్రగతి జోడీ బంగారు పతకంతో మెరిసింది.
చైనా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ తుదిపోరులో అమన్-ప్రగతి జంట 157-156తో కొరియా ద్వయంపై విజయం సాధించింది. కాంపౌండ్ టీమ్ ఈవెంట్లలో భారత పురుషుల, మహిళల జట్లు కాంస్యాలు ఖాతాలో వేసుకున్నాయి.