Andy Murray : టెన్నిస్ దిగ్గజం, మాజీ వరల్డ్ నంబర్ 1 ఆండీ ముర్రే(Andy Murray) అభిమానులకు షాకిచ్చాడు. సుదీర్ఘ కెరీర్‌కు త్వరలోనే వీడ్కోలు పలుకుతున్నట్టు మంగళవారం ముర్రే ప్రకటించాడు. పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) తర్వాత టెన్నిస్‌కు గుడ్ బై చెప్తానని బ్రిటర్ సీనియర్ ఆటగాడు వెల్లడించాడు.
‘ఒలింపిక్స్‌లో చివరిసారి ఆడేందుకు నేను పారిస్ వచ్చాను. బ్రిటన్‌కు ప్రాతినిధ్యం వహించడం నా కెరీర్‌లోని గొప్ప క్షణాల్లో ఒకటి. విశ్వ క్రీడల్లో ఆఖరిసారి దేశానికి ఆడుతున్నందుకు చాలా గర్వపడుతున్నా’ అని 37 ఏండ్ల ముర్రే తన ఎక్స్ ఖాతా పోస్ట్‌లో రాసుకొచ్చాడు. వయసు పెరగడంతో పాటు గాయాలు వేధిస్తుండడంతో ఆటకు అల్విదా పలకాలని ముర్రే నిర్ణయించుకున్నట్టు సమాచారం.
Arrived in Paris for my last ever tennis tournament @Olympics
Competing for 🇬🇧 have been by far the most memorable weeks of my career and I’m extremely proud to get do it one final time! pic.twitter.com/keqnpvSEE1— Andy Murray (@andy_murray) July 23, 2024
ఒలింపిక్స్‌లో ముర్రేకు గొప్ప రికార్డు ఉంది. 2012లో జరిగిన విశ్వ క్రీడల్లో బ్రిటన్ స్టార్ స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించాడు. అదే టోర్నీలో మిక్స్డ్ డబుల్స్‌లో ముర్రే వెండి పతకం కొల్లగొట్టాడు. డిఫెండింగ్ చాంపియన్ ట్యాగ్‌ను నిలబెట్టుకుంటూ ఈ స్టార్ ఆటగాడు 2016లో మరోసారి గోల్డ్ మెడల్‌తో మెరిశాడు.

మాజీ వరల్డ్ నంబర్ 1 అయిన ముర్రే మూడు గ్రాండ్‌స్లామ్స్ గెలుపొందాడు. 2013లో వింబుల్డన్ టైటిల్ కొల్లగొట్టిన ముర్రే.. 2016 వరుసగా ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ట్రోఫీలతో ప్రపంచ టెన్నిస్‌లో రారాజుగా వెలుగొందాడు. అయితే.. 2019లో ముర్రే తొడ భాగానికి ఆపరేషన్ చేయించుకున్నాడు. అప్పటినుంచి అతడు తరచూ గాయాలపాలవుతున్నాడు. తాజాగా సోదరుడు జేమీ ముర్రేతో కలిసి డబుల్స్ ఆడిన ఈ సీనియర్ ఆటగాడు వింబుల్డన్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.