Anand Mahindra : నూట నలభై కోట్లకుపైగా జనాభా కలిగిన భారత్ ఒలింపిక్స్‌లో రెండంకెల పతకాలు గెలవలేకపోవడం ఆశ్చర్యకరమే. విశ్వ క్రీడల్లో మన క్రీడాకారులు ఎంత ప్రయత్నించినా ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారు. తాజాగా పారిస్ ఒలింపిక్స్‌లోనూ ఆరు పతకాలతో భారత్ 71వ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) ఆసక్తికర పోస్ట్ పెట్టారు. భారత దేశ ఒలింపిక్ ర్యాంక్ పడిపోవడంతో బాధేస్తోందని అన్నారు.
ఒలింపిక్స్‌లో పతకాలు గెలవకుండా ఈ భూమ్మీద మనల్ని ఆపుతున్నది ఏదీ? అని మహీంద్ర ప్రశ్నించారు. ‘పారిస్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల విజయం పట్ల గర్వపడుతున్నా. అదే సమయంలో ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో మన దేశ ర్యాంక్ చూసి నాకు ఎంతో బాధగా ఉంది. సామార్థ్యం మేరకు ఎలా ఆడాలి? దేశ జనాభా గౌరవాన్ని కాపాడే పతకాలు గెలవాలి? అని ఇలా ప్రతి ఒక్కరికి ఒక థియరీ ఉంటుంది. కానీ, ఈ విషయంలో నాకు ఆలోచన తట్టడం లేదు. చాలా అయోమయంలో ఉన్నాను.
I’m extremely proud, of course, of our valiant medal winners of the Paris Olympics.
But I have to confess a sense of distress when seeing our overall ranking plummet.
Everyone usually has a great theory about what we need to do to live up to our potential & garner a… pic.twitter.com/ZS3SjVBvFn
— anand mahindra (@anandmahindra) August 17, 2024
ఎందుకంటే ప్రభుత్వం చాలా డబ్బులు ఖర్చు చేసింది. విజేతలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ప్రోత్సాహకాలు ఇచ్చాయి. అంతేకాదు ప్రభుత్వ, ప్రైవేట్ పరంగా క్రీడారంగంలో వసతులు, సౌకర్యాలు ఎంతో మెరుగయ్యాయి. ఓజిక్యూ, జిందాల్ వంటి ప్రైవేట్ కంపెనీల క్రీడాకారులు అద్భుతంగా రాణించారు. స్కూల్లు కూడా ఆటలపై దృష్టి పెడుతున్నాయి. క్రీడల పట్ల దేశపు ఆలోచన కూడా మారింది. అథ్లెట్ల విషయంలో చాలా ఆసక్తి చూపిస్తోంది. అంతేకాదు వాళ్ల విజయాన్ని గొప్పగా సెలబ్రేటే చేసుకుంటున్నాం. ఇంత జరుగతున్నా.. ఒలింపిక్స్‌లో పతకాలు రాకుండా ఈ భూమ్మీద మనల్ని అడ్డుకుంటున్నది ఏంటీ?’ అని మహీంద్ర తన సుదీర్ఘ పోస్టును ప్రశ్నతో ముగించారు.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఏడు పతకాలు సాధించింది. ఆ విశ్వ క్రీడల్లో ఇండియా 48వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. పారిస్‌లో కనీసం పది పతకాలు గెలవాలనుకున్న భారత అథ్లెట్ల కల చెదిరింది. ఏకంగా నలుగురు క్వార్టర్స్‌లోనే వెనుదిరిగి పతకం చేజార్చుకున్నారు. ఇక రెజ్లింగ్‌లో పతకం తెస్తుందనుకున్న వినేశ్ ఫొగాట్ అనూహ్యంగా నిష్క్రమించింది. వంద గ్రాముల అదనపు బరువుతో ఆమె మెడల్ ఆశలు గల్లంతయ్యాయి.