సూర్యాపేట టౌన్, డిసెంబర్ 31 : పోలీస్ సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమానికి పోలీసు శాఖ కృషి చేస్తుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నర్సింహ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇటివల నాగారం పోలీస్ స్టేషన్లో పని చేస్తూ రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన కానిస్టేబుల్ కమలాకర్ కుటుంబానికి పోలీసు చేయూత పథకం ద్వారా రూ.2 లక్షల చెక్కు అందజేసి మాట్లాడారు. చేయూత పథకం నిర్వహణకు జిల్లా పోలీసు సిబ్బంది ప్రతి నెల తమ జీతం నుండి విరాళం అందిస్తూ పోలీసు కుటుంబాలకు అండగా నిలుస్తునందుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, డీఎస్పీలు ప్రసన్నకుమార్, శ్రీనివాస్ రెడ్డి, నరసింహ చారి, ఏఓ మంజు భార్గవి, పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామచందర్ గౌడ్, ఆర్ ఎస్ఐ సాయిరాం పాల్గొన్నారు.