మునుగోడు, డిసెంబర్ 31 : మునుగోడు గ్రామ పంచాయతీ కార్యాలయం సమావేశ మందిరంలో సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ అధ్యక్షతన బుధవారం మొదటి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వార్డు సభ్యులు పలు సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకొచ్చారు. డ్రైనేజీ, వీధి లైట్లు, విద్యుత్ సమస్యలు, శానిటేషన్ పై తీర్మానాలు చేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారినికి వార్డు సభ్యులు ప్రతి ఒక్కరు ప్రత్యేక దృష్టి సారించాలని సర్పంచ్ కోరారు. ఈ సమావేశంలో పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.