Jagtial | రన్నింగ్లో ఊడిన ఆర్టీసీ బస్ చక్రాలు.. జగిత్యాల జిల్లాలో తప్పిన పెను ప్రమాదం..!
Jagtial | జగిత్యాల జిల్లాల్లో ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బస్ నడుస్తున్న సమయంలో వెనుకాల చక్రాలు రెండు ఊడిపోయాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పినట్లయ్యింది.
Jagtial | జగిత్యాల జిల్లాల్లో ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బస్ నడుస్తున్న సమయంలో వెనుకాల చక్రాలు రెండు ఊడిపోయాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పినట్లయ్యింది. సంఘటన జరిగిన సమయంలో 150 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల నుంచి నిర్మల్కు పల్లె బస్సు వెళ్తున్నది. ఈ క్రమంలో బస్సు జగిత్యాల శివారు మొరపల్లి గ్రామం వద్దకు చేరుకోగానే వెనుకాల రెండు చక్రాలు ఊడిపోయి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సుని నిలుపడంతో భారీ ప్రమాదం తప్పింది.
ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాకుండా బయటపడ్డారు. వరుసగా సెలవులు రావడంతో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. ఎక్కువ బస్సులు లేకపోవడంతో, ఉన్న బస్సులు సమయానికి రాకపోవడంతో అందుబాటులో ఉన్న బస్సుల్లోనే ప్రయాణికులు పరిమితికి మించి వెళ్తున్నారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 150 మంది వరకు ఉన్నట్లు తెలుస్తున్నది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

