న్యూయార్క్: అమెరికా దివ్యాంగ అథ్లెట్ జియోన్ క్లార్క్ అద్భుతం చేశాడు. కాళ్లు లేకుండానే జన్మించిన క్లార్క్..స్ఫూర్తిదాయక వ్యక్తగా, రచయితగా, ఎంటర్ప్రెన్యూర్గానే గాకుండా అథ్లెట్‌గా సత్తాచాటాడు. అర చేతులపై 20 మీటర్ల దూరాన్ని 4.78 సెకన్లలో పూర్తి చేసి ఔరా అనిపించాడు. గత ఫిబ్రవరిలో చేసిన ఈ ఫీట్ ప్రపంచ రికార్డుగా గిన్నిస్ పుస్తకంలోకి ఎక్కింది. జియోన్ అద్భుత ప్రదర్శనను గిన్నిస్ బుక్ సంస్థ తాజాగా అధికారిక గుర్తింపునిచ్చింది. ప్రతి పాఠశాలలో ఈ పుస్తకం విద్యార్థులకు అందుబాటులో ఉండనుంది. దీనిపై క్లార్క్ స్పందిస్తూ ‘పిల్లలను ప్రేరేపించడమే నా జీవిత లక్ష్యం’ అని అన్నాడు.