Sports
- Nov 28, 2020 , 21:14:42
భారత్‌తో రెండో వన్డేకు స్టాయినీస్ దూరం!

సిడ్నీ: భారత్‌తో తొలి వన్డేలో ఘన విజయం సాధించి ఉత్సాహంతో ఉన్న ఆతిథ్య ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినీస్ సిడ్నీ వేదికగా ఆదివారం జరగనున్న రెండో వన్డేకు దూరంకానున్నట్లు తెలిసింది. తొలి వన్డేలో భారత్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో అతడు నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఆ ఓవర్ రెండో బంతి వేసిన తర్వాత మైదానాన్ని వీడటంతో మిగతా బంతులను మరో ఆల్‌రౌండర్ మాక్స్వెల్ పూర్తి చేశాడు.
ఎడమవైపు నడుము నొప్పితో స్టాయినీస్ బాధపడుతున్నాడని, గాయం తీవ్రత తెలుసుకోవడానికి మరిన్ని వైద్య పరీక్షలు చేయించాల్సి ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధి ఒకరు చెప్పారు. స్టాయినీస్ తుది జట్టు నుంచి తప్పుకుంటే అతని స్థానంలో అన్క్యాప్డు ప్లేయర్ కెమెరాన్ గ్రీన్, మరో ఆల్‌రౌండర్ హెన్రిక్స్‌ను ఎంపిక చేయనున్నారు.
తాజావార్తలు
- కొవిడ్-19 : మేజికల్ స్ప్రేపై పరీక్షలు
- లిప్‌లాక్ సీన్ కు లావణ్యత్రిపాఠి ఒకే..?
- ఇకపై ప్రతి నెలా టెస్ట్ క్రికెట్లో బెస్ట్ ప్లేయర్ అవార్డు
- ఎర్రకోటపై దాడి.. రైతులను రెచ్చగొట్టింది ఇతడేనా?
- పూజాహెగ్డే డిమాండ్..మేకర్స్ గ్రీన్ సిగ్నల్..!
- ఇండియాలో ఉద్యోగులను తొలగిస్తున్న టిక్‌టాక్
- కారు, లారీ ఢీ.. ఐదుగురు దుర్మరణం
- చరిత్రలో ఈ రోజు.. కరెంటు బుగ్గకు పేటెంట్ దక్కిందీరోజే..
- బాండ్ స్కామ్ : గోల్డ్‌మన్ సీఈవో వేతనంలో భారీ కోత
- చెన్నై చేరిన ఇంగ్లండ్ క్రికెటర్లు..
MOST READ
TRENDING