న్యూఢిల్లీ: అల్జీరియా ఒలింపిక్ బాక్సర్ ఇమానె కెలీఫ్ మళ్లీ వివాదంలో చిక్కుకుంది. ప్రత్యర్థి బాక్సర్లను చిత్తుచేస్తూ పారిస్ ఒలింపిక్స్(2024)లో పసిడి పతకం సాధించిన ఇమాఈన కెలీఫ్లో మగ లక్షణాలు ఉన్నట్లు భారత్‌కు చెందిన ప్రముఖ ల్యాబ్ నుంచి కీలక డాక్యుమెంట్లు బయటికి వచ్చాయి. 2023లో నిర్వహించిన పరీక్షల్లో కెలీఫ్లో మగ లక్షణాలైన ‘ఎక్స్‌వై’ క్రొమోజోమ్లు ఉన్నట్లు న్యూయార్క్ పోస్ట్ పత్రిక తమ కథనంలో పేర్కొంది. న్యూఢిల్లీకి చందిన లాల్‌పాత్ ల్యాబ్స్ నుంచి కెలీఫ్ లింగ నిర్ధారణ పరీక్షల ఫలితాలు బయటికి రావడం సంచలనం కల్గించింది. అయితే దీనిపై కెలీఫ్ స్పందిస్తూ ‘ఇవన్నీ నిరాధార ఆరోపణలు అమ్మాయిగానే పుట్టాను, అమ్మాయినే గుర్తించబడ్డాను’ అంటూ పేర్కొంది. కెలీఫ్ లింగ నిర్ధారణపై పారిస్ ఒలింపిక్స్‌లో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇమానె కెలీఫ్ పంచ్‌ల ధాటికి బలైన ప్రత్యర్థి బాక్సర్లు తమ భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తం చేశారు.