Upasana | గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి, అపోలో హెల్త్ వైస్ ఛైర్పర్సన్, సామాజిక సేవలో చురుకైన ఉపాసన కామినేని భక్తి పథంలో మరో ముందడుగు వేసింది. నిత్యం తన కార్యాలయ జీవితం, హెల్త్ ఇష్యూస్, ఫ్యామిలీ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కనిపించే ఉపాసన, తాజాగా 9 వారాల సాయిబాబా వ్రతాన్ని పూర్తి చేసి తన మనోవేదన, భక్తిని ప్రేక్షకులతో పంచుకున్నారు. గత గురు పౌర్ణమి రోజున (జూలైలో) ఉపాసన సాయిబాబా వ్రతాన్ని ప్రారంభించారు. ఈ ప్రయాణంలో ఆమెకు సపోర్ట్‌గా నిలిచిన వ్యక్తి క్లింకారా, నర్స్ లతా సిస్టర్. ఇద్దరూ కలిసి ఈ భక్తిమార్గాన్ని ప్రారంభించిన విషయం ఇప్పటికే ఆమె వెల్లడించారు. తాజాగా, సెప్టెంబర్ 4న వ్రతం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు.
వ్రతం ముగిసిన సందర్భంగా ఉపాసన.. గురు పౌర్ణమి నాడు ప్రారంభించిన నా సాయిబాబా వ్రతం 9 వారాల పాటు కొనసాగింది. శాంతి, స్వస్థత, విశ్వాసంతో నా ప్రయాణం ముగిసింది. బాబా ఆశీస్సులతో నేను కోరుకునన్న దానికన్నా ఎక్కువ దక్కింది. జీవిత కాలంలో వీలైనంత మందికి సేవ చేయాలని బాబాను ప్రార్థించాను. ఈ రోజు అత్తమ్మాస్ కిచెన్ తరపున భోజనం వడ్డిస్తున్నాము. జై సాయిరామ్. ఈ వీడియో మరియు క్యాప్షన్‌ను చూసిన అభిమానులు ఎంతో ఎమోషనల్‌గా స్పందిస్తున్నారు. ఉపాసన మానసికంగా బలంగా ఉండడాన్ని అభినందిస్తున్నారు. తన బిజీ షెడ్యూల్ మధ్యలోనూ ఉపాసన భక్తితో వ్రతం చేయడం విశేషం. చిన్ననాటి నుంచే దేవుని మీద తనకు ఉన్న విశ్వాసాన్ని ఆమె ఎన్నో సందర్భాల్లో తెలియజేశారు. వ్రతం మొదలుపెట్టిన దగ్గర నుంచి సానుకూల ఆలోచనలు, శాంతి, అనుకూల పరిస్థితులు తలుపు తట్టాయని ఆమె అనుభవాన్ని పంచుకున్నారు.
ఈ పవిత్ర ప్రయాణాన్ని చూసిన రామ్‌చరణ్ అభిమానులు ఉపాసనను అభినందిస్తూ సోషల్ మీడియా కామెంట్లతో ముంచెత్తుతున్నారు. బాబా ఆశీస్సులతో ఆమె కుటుంబం శుభం చేకూరాలని కోరుకుంటున్నారు.ఉపాసన వ్యక్తిగత జీవితం, పాజిటివ్ ఎనర్జీ, సామాజిక సేవా రంగాల్లో ఆమె చూపుతున్న కమిట్మెంట్ యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.