US Open | డిఫెండింగ్ చాంపియన్, బెలారస్ స్టార్ ప్రపంచ నంబర్‌వన్ అరీనా సబలెంక (Aryna Sabalenka) వరుసగా మూడోసారి యూఎస్ ఓపెన్ (US Open) ఫైనల్లోకి అడుగుపెట్టింది. నువ్వా నేనా అన్నట్లుగా జరిగిన సెమీఫైనల్లో జెస్సికా పెగులాపై (Jessica Pegula) 4-6, 6-3, 6-4 తేడాతో విజయం సాధించింది. తొలి రౌండ్‌తో 4-6తో కోల్పోయినప్పటికీ పట్టు విడవకుండా ఆడిన సబలెంత తర్వాతి రెండు రౌండ్లలో విజయం సాధించి.. మరోసారి ట్రోఫీని దక్కించుకోవడానికి ముందడుగు వేసింది. దీంతో శనివారం జరుగనున్న ఫైనల్లో 8వ సీడ్ అమాండా అనిసిమోవా లేదా 23వ సీడ్ నవోమీ ఒసాకాతో తలపడనుంది.
ఈ ఏడాది ఇప్పటికే మూడు టైటిళ్లు సాధించిన సబలెంకా, ఓవరాల్‌గా 19 టైటిళ్లు సొంతం చేసుకున్నది. ఫైనల్లో గెలిస్తే సెరెనా విలియమ్స్ తర్వాత యూఎస్ ఓపెన్‌ను వరుసగా గెలుచుకున్న తొలి క్రీడాకారిణిగా నిలువనుంది. సెరెనా 2012 నుంచి 2014 వరకు వరుసగా మూడు సార్లు యూఎస్ ఓపెన్‌ను చేజిక్కించుకున్నది.