సమర్కంద్ (ఉజ్బెకిస్థాన్): భారత యువ గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ ఫిడే గ్రాండ్‌స్విస్ టోర్నీలో శుభారంభం చేశాడు. గురువారం నాటి తొలి రౌండ్లో గుకేశ్.. ఫ్రాన్స్‌కు చెందిన ఎటిన్నె బాక్రొట్ను ఓడించాడు. నల్లపావులతో ఆడిన అతడు.. తొలి ఎత్తు నుంచే ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు.
టాప్ సీడ్ ప్రజ్ఞానంద.. జెఫ్రీ జియాంగ్‌తో తొలి గేమ్‌ను డ్రాగా ముగించాడు. డిఫెండింగ్ చాంపియన్ విదిత్ గుజరాతీ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్‌ను ఓడించాడు.