Alia Bhatt | ప్రస్తుతం పాన్ ఇండియా సినీరంగంలో ఓ వెలుగు వెలుగుతున్న అందాల ముద్దుగుమ్మ అలియా భట్. 31 సంవత్సరాల వయసుగల ఈ భామ తన నటనతో లక్షలాది మందిని ఆకట్టుకుంది. ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత మంచి విజయాలు దక్కించుకుంది. రణ్‌బీర్ సింగ్‌ని ప్రేమించి వివాహం చేసుకున్న అలియా రాహా అనే చిన్నారికి జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈమె వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. అయితే అలియా భట్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు చేసిన కథల కన్నా కాస్త భిన్నమైన సినిమాలని ఎంపిక చేసుకోనున్నట్టు తెలియజేసింది.
రాహా ఎంజాయ్ చేసే సినిమాలు నేను ఇప్పటి వరకు చేయలేదు. ఇకపై తను నవ్వుకునే సినిమాలు చేయాలని అనుకుంటున్నా. కామెడీ చిత్రాలకి ప్రాధాన్యత ఇస్తాను. ఇప్పుడు నా కూతురి కోసం జానర్ మార్చుకోవాలని డిసైడ్ అయ్యాను. ఇప్పటికే కొన్ని ప్రాజెక్ట్స్ అంగీకరించాను. అవేంటో ఇప్పుడే చెప్పలేను. త్వరలో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాను అని అలియా పేర్కొంది. ఇక దర్శకుడు మహేష్ భట్ కుమార్తె గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలియా భట్, కరణ్ జోహార్ తెరకెక్కించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.
తొలి సినిమాతోనే మంచి నటిగా ప్రశంసలు అందుకున్నఈ ముద్దుగుమ్మ కెరీర్లో అనేక అవార్డులను దక్కించుకుంది. అయితే అలియా భట్12వ తరగతి కూడా పూర్తి చేయలేదు. చదువు మధ్యలోనే మానేసి నటనపై ఆసక్తి పెంచుకున్న అలియా భట్ ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది . ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణులలో ఒకరిగా ఉంది ఈ ముద్దుగుమ్మ. నివేదికల ప్రకారం అలియా ఆస్తులు రూ. 4,600 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. ఈ భామ ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులని పలకరించింది.