Davis Cup Finals : టెన్నిస్ సంచలనం కార్లోస్ అల్కరాజ్(Carlos Alacaraz) ఈసారి ఓటమి తప్పించుకున్నాడు. యూఎస్ ఓపెన్ రెండో రౌండ్లో కంగుతిన్న ఈ యువకెరటం ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా తమ దేశాన్ని గెలిపించాడు. డేవిస్ కప్ ఫైనల్స్(Davis Cup Finals)లో స్పెయిన్‌కు అల్కరాజ్ అద్భుత విజయాన్ని అందించాడు. గురువారం జరిగిన పోరులో మూడో సీడ్ అల్కరాజ్ చెక్ రిపబ్లిక్కు చెందిన థామస్ మచాక్ను చిత్తు చేశాడు.
పారిస్ ఒలింపిక్స్ తర్వాత అల్కరాజ్ మరోసారి గర్జించాడు. డేవిస్ కప్ ఫైనల్స్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో థామస్‌కు చెక్ పెట్టాడు. అయితే.. అతికష్టమ్మీద గెలిచాడనే చెప్పాలి. ఎందుకంటే.. థామస్ ధాటికి అల్కరాజ్ తొలి సెట్ కోల్పోయాడు. దాంతో, ఇక మరో ఓటమి తప్పదు అనుకున్నారంతా. కానీ రెండో సెట్లో తన మార్క్ ఆటతో చెలరేగి ప్రత్యర్థి దూకుడుకు కళ్లెం వేశాడు. దాంతో, ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు నడిచించింది.
🇪🇸 🇪🇸 🇪🇸@carlosalcaraz wins the tie for Spain 2-0 after Machac retires due to injury
Get well soon, Tomas!#DavisCup | @RFETenis pic.twitter.com/4I0UEIHrET
— Davis Cup (@DavisCup) September 11, 2024
అంతలోనే థామస్‌కు కండరాలు పట్టేయడంతో అతడు రిటైర్డ్ అయ్యాడు. దాంతో, అల్కరాజ్ 6-7(3), 6-1తో గెలుపొందాడు. ఈ విజయంతో స్పెయిన్ 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ ఇటలీ, బ్రిటన్లు బోణీ కొట్టాయి. స్టార్ ఆటగాడు జన్నిక్ సిన్నర్ లేకున్నా సరే 2-1తో బ్రెజిల్‌ను ఇటలీ ఓడించింది.
పురుషుల టెన్నిస్‌లో దూసుకొచ్చిన అల్కారాజ్ నిరుడు ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్(Wimbledon) గ్రాండ్‌స్లామ్‌లతో చరిత్ర సృష్టించాడు. అయితే.. పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణంపై కన్నేసిన అతడికి నొవాక్ జకోవిచ్(Novak Djokovic) ఝలక్ ఇచ్చాడు. విశ్వక్రీడల్లో రజత పతకంతో మెరిసిన అల్కరాజ్ యూఎస్ ఓపెన్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. కానీ, . అక్కడ అతడికి గట్టి షాక్ తగిలింది. అనామకుడైన బొటిక్ వాన్ డి జండ్స్చుల్ప్ చేతిలో 1-6, 5-6, 4-6తో అనూహ్యంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే.