Riddhi Kumar | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, రిద్ధి కుమార్ హీరోయిన్గా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, అప్డేట్స్ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.ఈ క్రమంలో రీసెంట్గా హైదరాబాద్‌లో జరిగిన ‘ది రాజా సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ రిద్ధి కుమార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కో హీరోయిన్లు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్‌తో కలిసి సందడి చేసిన రిద్ధి, వేదికపై మాట్లాడుతూ తాను కట్టుకున్న చీరను ప్రభాస్ గిఫ్ట్‌గా ఇచ్చారని చెప్పడంతో ఒక్కసారిగా హాల్ మొత్తం ఈలలు, చప్పట్లతో మార్మోగిపోయింది.
ఈ విషయం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో నెటిజన్లు తెగ చర్చించుకున్నారు. “ప్రభాస్ భోజనాలే కాదు… చీరలు కూడా గిఫ్ట్ ఇస్తారా?”, “రిద్ది అంత స్పెషల్ ఏంటి?” అంటూ సరదా కామెంట్లు పెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో రిద్ధి కుమార్ ఆ చీర వెనుక ఉన్న కథను వివరించారు. రిద్ది మాట్లాడుతూ… దీపావళి తర్వాత ‘రాజా సాబ్’ సెట్స్‌లో ఫస్ట్ టైమ్ అడుగుపెట్టాను. అది అక్టోబర్ 23. అదే రోజు ప్రభాస్ గారి బర్త్ డే. ఆయన అక్కడే ఉన్నారు. నేను ఆయనకు గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాను. రెండు రోజుల తర్వాత దీపావళి పార్టీ జరిగింది. ఆ సమయంలో మారుతి సర్ ‘ప్రభాస్ మీతో మాట్లాడతారు’ అన్నారు. అలా తొలిసారి ఆయనతో ఫోన్లో మాట్లాడాను” అని తెలిపారు.
ఆ కాల్ సమయంలో నేను ముంబైలో ఉన్నాను. బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పాను. ఆయన ఓకే అన్నారు. అదే సమయంలో నాకు కూడా దీపావళి గిఫ్ట్ ఉందని చెప్పారు. సెట్స్‌కు వెళ్లేటప్పుడు నేను కర్ణుడి కథ ఆధారంగా శివాజీ సావంత్ రాసిన ‘మృత్యుంజయ్’ పుస్తకాన్ని గిఫ్ట్‌గా తీసుకెళ్లాను అని రిద్ధి వెల్లడించారు. కర్ణుడి నేచర్, ప్రభాస్ గారి నేచర్ చాలా సిమిలర్‌గా అనిపిస్తాయి. ప్రభాస్ అంటే రాజులాంటి వ్యక్తి. నేను బుక్ ఇచ్చినప్పుడు ఆయన సర్ప్రైజ్ అయ్యారు. ఆ తర్వాత ‘కల్కి’ సినిమా చూసినప్పుడు ఆ సింక్ నాకు ఇంకా బాగా అర్థమైంది. ఆ తర్వాత ప్రభాస్ గారు నాకు చీర గిఫ్ట్ ఇచ్చారు. అది చాలా లవ్లీగా ఉంది. మూడేళ్ల పాటు దాచిపెట్టుకున్నాను. ఇప్పుడు ‘రాజా సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అదే చీర కట్టుకున్నాను” అని చెప్పుకొచ్చారు. అయితే రిద్ధి కుమార్ – ప్రభాస్ ఫ్రెండ్షిప్ ఇప్పటిది కాదు. ఇప్పటికే ‘రాధేశ్యామ్’ సినిమాలో కలిసి నటించిన ఈ జంట, ఇప్పుడు ‘ది రాజా సాబ్’ లో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.