Pranaam-Make in India Hospitals | మేకిన్ ఇండియా హాస్పిటల్స్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదిరిందని ప్రణాం హాస్పిటల్స్ ప్రకటించింది. హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో ప్రాజెక్టులను ప్రారంభించడానికి మేకిన్ ఇండియా హాస్పిటల్స్‌తో భాగస్వామ్యం గర్వంగా ఉందని ప్రణాం హాస్పిటల్స్ తెలిపింది. కరుణ, శ్రేష్ఠమైన వారసత్వంతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన హెల్త్‌కేర్ సేవలందించాలన్న విజన్‌తో పని చేస్తున్నట్లు ప్రణాం హాస్పిటల్స్ పేర్కొంది. అధునాతన మెడికల్ టెక్నాలజీతో ఏండ్ల తరబడి రోగులకు వైద్య సేవలందించడంలో వైద్య రంగంలో విశ్వసనీయ సంస్థగా ఎదిగాం అని వెల్లడించింది.
ప్రణాం హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మనీష్ గౌర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. `మేకిన్ ఇండియా హాస్పిటల్స్‌తో సహకార ఒప్పందంతో మా ప్రయాణంలో పరివర్తన దశ. మరింత మందికి హెల్త్ కేర్ సేవలు అందుబాటులోకి తేవాలన్న మా మిషన్‌ను శక్తిమంతం చేస్తుంది. తక్కువ ధరకే వైద్య సేవలు అందుబాటులోకి తేవాలన్న మా నిబద్ధతను బలోపేతం చేస్తుంది` అని వ్యాఖ్యానించారు. ప్రణాం హాస్పిటల్స్ గ్రూప్ సీఈఓ డాక్టర్ అన్నీ ఠాకూర్ స్పందిస్తూ.. `మేకిన్ ఇండియా హాస్పిటల్స్‌తో భాగస్వామ్యం మా హాస్పిటల్స్‌లో కొత్త అధ్యాయం నెలకొల్పుతుంది. హైదరాబాద్, విశాఖపట్నం నగరాలకు మా సేవలను విసర్తించడం ద్వారా విస్తృత ప్రజానీకానికి ఉత్తమ టెక్నాలజీతో హెల్త్‌కేర్ సేవలు అందించడానికి మార్గం సుగమం అవుతుంది` అని పేర్కొన్నారు.
ఏఎంటీజడ్ ఫౌండర్ అండ్ సీఈఓ డాక్టర్ జితేంద్ర శర్మ మాట్లాడుతూ.. `సృజనాత్మకతతో హెల్త్‌కేర్ సేవలను అందుబాటులోకి తేవడానికి మేకిన్ ఇండియా హాస్పిటల్స్-ప్రణాం హాస్పిటల్స్ సహకారం ఒప్పందం నిజమైన నిదర్శనం. దేశంలోని ప్రతి మారు మూల ప్రాంతానికి తక్కువ ధరలోనే నాణ్యతతో కూడిన ఆరోగ్య సేవలు తేవడమే మా లక్ష్యం` అని చెప్పారు. డాక్టర్ జితేంద్ర శర్మ అంకిత భావం, వ్యూహాత్మక విధానంతో రెండు హాస్పిటల్స్ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. మేకిన్ ఇండియా హాస్పిటల్స్ ఇన్షియేటివ్‌లో భాగంగా ఏఎంటీజడ్ క్యాంపస్‌లో మెడ్ టెక్ సొసైటీతో అవగాహనా ఒప్పందంపై ప్రణాం హాస్పిటల్స్, మేకిన్ ఇండియా హాస్పిటల్స్ ప్రతినిధులు సంతకాలు చేశారు.