అమరావతి : సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు(Chandra Babu) విచారం వ్యక్తం చేశారు. భారతదేశ రాజకీయాల్లో అత్యంత గౌరవనీయమైన వ్యక్తుల్లో ఏచూరి ఒకరని పేర్కొన్నారు.
పార్టీలో కింది స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగారని కొనియాడారు. ఏచూరి ఆలోచనలు సీపీఎం(CPM0) పార్టీకి ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాయని అన్నారు. ఏచూరి కుటుంబ సభ్యులు, సహచరులు, అనుచరులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఏచూరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
గత నెల 19వ తేదీన శ్వాసకోశ సమస్యలతో సీతారాం ఏచూరి ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నప్పటికి రెండు రోజులుగా పరిస్థితి మరింత విషమించింది. గురువారం మధ్యాహ్నం ఆయన ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.