Bhupalapally | భూపాలపల్లి ఎస్సీ బాలికల గురుకులంలో విద్యార్థినిని విచక్షణారహితంగా కొట్టిన వార్డెన్‌పై వేటుపడింది. డిగ్రీ విద్యార్థినిని చితకబాదిన వార్డెన్ భవానీని కలెక్టర్ సస్పెండ్ చేశారు. వార్డెన్‌పై పలు ఆరోపణల నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని DWOని ఆదేశించారు.
అసలేం జరిగిందంటే.. డిగ్రీ విద్యార్థినిని వార్డెన్ చితకబాదిన వీడియో ఒకటి తాజాగా వైరల్‌గా మారింది. ఎగ్జిట్ అయి చెప్పి పోయినవ్ కదా హాస్టల్లో.. ఎగ్జిట్ పన్నెండింటికి అయిపోతది. మళ్లీ ఎగ్జిట్ అయిపోయే టైం హాస్టల్ ఉండాలన్న సోయి లేదా నీకు అంటూ వార్డెన్ ఓ వైపు కర్రలు, మరోవైపు చేతులతో విద్యార్థినిని చితకబాదింది. ఆ సమయంలో అక్కడే ఉన్న తోటి విద్యార్థినులు వీడియో తీశారు. గత 24న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్‌గా మారింది. దీంతో వార్డెన్ తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఇదే కాకుండా ఇదే వార్డెన్ రెండు నెలల క్రితం విద్యార్థినులకు మత బోధనలు చేయించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు ఘటనలను సీరియస్‌గా తీసుకున్న జిల్లా కలెక్టర్.. వార్డెన్ భవానీని సస్పెండ్ చేశారు.
బాలికల గురుకులంలో విద్యార్థినిని విచక్షణారహితంగా కొట్టిన వార్డెన్
భూపాలపల్లిలోని ఎస్సీ బాలికల గురుకులంలో విద్యార్థినిని తన రూంకి పిలిపించుకుని కర్రతో ఇష్టమొచ్చినట్లు కొట్టిన వార్డెన్ భవానీ
ప్రతి రోజు ఇలాగే తమను ఏదో సాకు చూపించి కొడుతుందని విద్యార్థుల ఆవేదన
విద్యార్థులను… pic.twitter.com/RVGBVfAnXJ
— Telugu Scribe (@TeluguScribe) December 29, 2025