PwC Layoffs : 2009 తర్వాత ఆర్ధిక సేవల దిగ్గజం ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ (PwC) మాస్ లేఆఫ్స్‌కు తెగబడింది. అమెరికాలో దాదాపు 1800 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించేందుకు పీడబ్ల్యూసీ సన్నద్ధమైంది. లేఆఫ్స్‌తో అసోసియేట్స్, మేనేజింగ్ డైరెక్టర్లు, బిజినెస్ సర్వీసులు, ఆడిట్, పన్ను విభాగాల్లో పనిచేసే ఉద్యోగులపై ప్రభావం పడనుంది. ప్రధానంగా పీడబ్ల్యూసీ అడ్వైజరీ, ప్రోడక్ట్స్, టెక్నాలజీ ఆపరేషన్స్ విభాగాలపై పెనుప్రభావం పడనుంది.
లేఆఫ్స్ బాధితుల్లో సగం మంది అమెరికా వెలుపల పనిచేసే ఉద్యోగులేనని తెలిసింది. విస్తృత పునర్వ్యవస్ధీకరణ ప్రణాళికల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకునే క్రమంలో భవిష్యత్‌లో పటిష్టంగా ఎదిగే క్రమంలో ఈ పునర్వ్యవస్దీకరణ ప్రణాళికలు చేపట్టామని ఉద్యోగులకు మెమోలో వివరించామని పీడబ్ల్యూసీ యూఎస్ లీడర్ పౌల్ గ్రిగ్స్ తెలిపారు.
ఎర్నెస్ట్ అండ్ యంగ్, కేపీఎంజీ, డెలాయిట్ వంటి ప్రత్యర్ధి కంపెనీలు లేఆఫ్స్‌కు తెగబడినా 2009 నుంచి మాస్ లేఆఫ్స్‌ను నివారించిన పీడబ్ల్యూసీ అనూహ్యంగా పెద్దసంఖ్యలో లేఆఫ్స్ ప్రకటించడం ఉద్యోగుల్లో గుబులు రేగుతోంది. మరోవైపు పీడబ్ల్యూసీ చైనా కూడా సమస్యల్లో కూరుకుపోయింది. ప్రధాన క్లైంట్ కంట్రీ గార్డెన్ హోల్డింగ్స్‌ను చేజార్చుకోవడం పీడబ్ల్యూసీ చైనాకు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
Read More :
Good news | రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. దసరా, దీపావళికి 24 ప్రత్యేక రైళ్లు