అమరావతి : దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త (Good news ) తెలిపింది. దసరా, దీపావళి పండుగ సందర్భంగా 24 ప్రత్యేక రైళ్లను(Special trains ) నడుపనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని రైల్వే అధికారులు వెల్లడించారు. ఛాత్ పూజకు(Chaat Puja) వెళ్లే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లనూ నడుపుతున్నట్లు వివరించారు.
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 12 వరకు ప్రయాణికులకు రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు సికింద్రాబాద్(Secundrabad)-తిరుపతి(Tirupati) కి ప్రత్యేక రైలు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుందని తెలిపారు. తిరుపతి-సికింద్రాబాద్కు అక్టోబర్ 8 నుంచి నవంబర్ 12 వరకు ప్రతి మంగళవారం ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందన్నారు.
తిరుపతి-శ్రీకాకుళం మధ్య అక్టోబరు 6 నుంచి నవంబర్ 10 వరకు ప్రత్యేక రైలు ప్రతి ఆదివారం, శ్రీకాకుళం- తిరుపతికి అక్టోబర్ 7 నుంచి నవంబరు 11 వరకు ప్రత్యేక రైలు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.