న్యూఢిల్లీ: బిలియనీర్ జేర్డ్ ఇజాక్మాన్..తొలిసారి స్పేస్‌వాక్(Spacewalk) చేశారు. స్పేస్ఎక్స్ సంస్థ కు చెందిన డ్రాగన్ వ్యోమనౌకలో ఆయన నింగిలోకి వెళ్లారు. నాన్ ప్రొఫెషనల్ ఆస్ట్రోనాట్ ఇజాక్మాన్.. ఇవాళ అంతరిక్షంలో స్పేస్‌వాక్ చేశారు. భూమి నుంచి స్పేస్ స్టేషన్ ఉండే దూరానికి మూడు రెట్ల అధిక దూరంలో డ్రాగన్ వ్యోమనౌక ఉన్నది. స్పేస్‌క్రాఫ్ట్‌కు చెందిన కిటికీ ఓపెన్ కాగానే, స్పేస్ఎక్స్ సంస్థ ప్రధాన కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి. ఇజాక్మాన్ వాక్ తర్వాత సారా గిల్స్ కూడా స్పేస్‌వాక్‌లో పాల్గొన్నది.
వ్యోమనౌకలో మొత్తం నలుగురు నాన్ ప్రొఫెషనల్ వ్యోమగాములు వెళ్లారు. బిలియనీర్ ఇజాక్మాన్ ఈ ట్రిప్ కోసం ఎలన్ మస్క్ కంపెనీకి భారీగా డబ్బులు చెల్లించారు. ఈ వ్యాపారం ద్వారా బాగా ఆర్జించాలని మస్క్ ప్లానేశారు. భూమికి 435 మైళ్ల దూరంలో ఇజాక్మాన్ తో మరో ముగ్గురు స్పేస్‌వాక్‌లో పాల్గొన్నారు. అంతరిక్షం నుంచి భూమిని చూసిన అతను.. భూమి అద్భుతంగా ఉన్నట్లు ఇజాక్మాన్ పేర్కొన్నారు.
Commander @rookisaacman has egressed Dragon and is going through the first of three suit mobility tests that will test overall hand body control, vertical movement with Skywalker, and foot restraint pic.twitter.com/XATJQhLuIZ
— SpaceX (@SpaceX) September 12, 2024