Laver Cup 2024 : యూఎస్ ఓపెన్ నుంచి అనూహ్యంగా వెనుదిరిగిన టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) మళ్లీ రాకెట్ పట్టాడు. టీమ్ యూరప్ తరపున లావెర్ కప్(Laver Cup 2024)లో ఆడుతున్న స్పెయిన్ కెరటం అద్బుత విజయం సాధించాడు. డబుల్స్‌లో తేలిపోయిన అల్కరాజ్ శనివారం ఉబెర్ అరేనాలో జరిగిన సింగిల్స్ మ్యాచ్‌లో బెన్ షెల్టన్‌ను మట్టికరిపించాడు.
తన మార్క్ షాట్లతో అలరించిన అల్కరాజ్ వరుస సెట్లలో షెల్టన్‌పై ఆధిపత్యం చెలాయించాడు. 6-4, 6-4తో అమెరికా కుర్రాడిని చిత్తుగా ఓడించాడు. అనంతరం అల్కరాజ్ ప్రేక్షకుల వైపు తిరిగి విజయదరహాసం చేశాడు. మరో సింగిల్స్ మ్యాచ్‌లో
టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదేవ్ (Daniil Medvedev)కు ఊహించని షాక్ తగిలింది.
.@FTiafoe regains the lead in Berlin for Team World.#LaverCup pic.twitter.com/p34EJ4pqZk
— Laver Cup (@LaverCup) September 21, 2024
యూఎస్ ఓపెన్ సెమీఫైనలిస్ట్ ఫ్రాన్సెస్ టియఫో సంచలన ప్రదర్శనతో అతడికి చెక్ పెట్టాడు. ఆరంభంలో మెద్వెదేవ్ ధాటికి తొలి సెట్ కోల్పోయిన టియాఫో ఆ తర్వాత పుంజుకున్నాడు. వరుసగా రెండు సెట్లలో రష్యా స్టార్ జోరుకు పగ్గాలు వేసి 3-6, 6-4, 10-5తో విజేతగా నిలిచాడు. అతడి విజయంతో టీమ్ వరల్డ్ జట్టు 4-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Back in business.@carlosalcaraz earns a vital two points for Team Europe.#LaverCup pic.twitter.com/iRdaEyaUN1
— Laver Cup (@LaverCup) September 21, 2024