Adil Rashid : టీ20 స్పెషలిస్ట్ అయిన ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్(Adil Rashid) చరిత్ర సృష్టించాడు. ఆ దేశం తరుఫున వన్డేల్లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డుపుటల్లోకి ఎక్కాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో రషీద్ ఈ ఘనతకు చేరువయ్యాడు. గత కొన్ని ఏండ్లుగా ఇంగ్లండ్ విజయాల్లో కీలకం అవుతున్న ఈ లెగ్ స్పిన్నర్ 137వ మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదు చేశాడు.
శనివారం గ్లెన్ మ్యాక్స్‌వెల్(Glenn Maxwell) వికెట్ పడగొట్టిన రషీద్ రెండొందల క్లబ్లో చేరాడు. అతడి తర్వాత ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో ఎక్కువ వికెట్లు తీసిన స్పిన్నర్ల జాబితాలో మోయిన్ అలీ(111 వికెట్లు), గ్రేమ్ స్వాన్(104 వికెట్లు)లు ఉన్నారు. అంతేకాదు 50 ఓవర్ల ఫార్మాట్లో రెండొందల వికెట్లు పడగొట్టిన మూడో ఇంగ్లండ్ బౌలర్‌గానూ రషీద్ గుర్తింపు సాధించాడు. అతడి కంటే ముందు మాజీ స్పీడ్‌స్టర్ డారెన్ గాఫ్(Darren Gough), వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్(James Anderson)లు ఈ మైలురాయికి చేరుకున్నారు.
🚨 2️⃣0️⃣0️⃣ ODI WICKETS 🚨
And incredible effort, Rash 👏 pic.twitter.com/qetuJZj36q
— England Cricket (@englandcricket) September 21, 2024