Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ(Akula Sreeja), మనికా బత్రా(Manika Batra)లు అదరగొట్టారు. ఇద్దరూ తమ సంచలన ఆటతో ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. తద్వారా భారత టేబుల్ టెన్నిస్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి పెడ్లర్లుగా చరిత్ర సృష్టించారు.
బుధవారం సింగపూర్‌కు చెందిన జియాన్ జెంగ్(Jian Zeng)ను శ్రీజ 4-2తో ఓడించింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో భారత పెడ్లర్ అద్భుతంగా ఆడింది. తొలి సెట్లో వెనకడినా ఆ తర్వాత పుంజుకొని జియాన్‌కు చెక్ పెట్టింది. హోరాహోరీగా సాగిన పోరులో శ్రీజ 9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10తో ప్రత్యర్థిని మట్టికరిపించింది.
మరో మ్యాచ్‌లో దుమ్మురేపిన మనికా బత్రా 18వ ర్యాంకర్‌కు చెక్ పెట్టింది. స్థానిక క్రీడాకారిణి అయిన ప్రిథికా పవడేపై 4-0తో జయకేతనం ఎగురవేసింది. దాంతో, దర్జాగా 16వ రౌండ్లో అడుగుపెట్టింది.
𝙈𝙞𝙡𝙚𝙨𝙩𝙤𝙣𝙚 🔓
Manika Batra and Sreeja Akula have etched their names in history as the only Indian table tennis paddlers to advance to the RO16. 👑👑#SreejaAkula #ManikaBatra #UTT4India #TeamIndia #UTT #UltimateTableTennis #TableTennis pic.twitter.com/Ie8sI7ofaB
— Ultimate Table Tennis (@UltTableTennis) July 31, 2024
మరోవైపు పురుషుల విభాగంలో సీనియర్ ఆటగాడు అచంత శరత్ కమల్ని(Achanta Sharath Kamal) రాశపరిచిన విషయం తెలిసిందే. కెరీర్లో చివరి ఒలింపిక్స్ ఆడుతున్న శరత్ అనూహ్యంగా తొలి రౌండ్లోనే ఓటమి పాలయ్యాడు.