Paris Olympics | టోక్యో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గి వరుసగా రెండో పతకంపై కన్నేసిన యువ బాక్సర్ లవ్లీనా బోర్గొహెయిన్ పారిస్‌లోనూ అదరగొడుతోంది. మహిళల 75 కిలోల విభాగం ప్రిక్వార్టర్స్ పోరులో భాగంగా లవ్లీనా 5-0 తో సున్నివా హెఫ్స్టడ్ (నార్వే)ను మట్టికరిపించింది. ఈ విజయంతో లవ్లీనా క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో నెగ్గి సెమీస్ చేరుకుంటే లవ్లీనా మరో పతకం ఖాయం చేసినట్టే.
నార్వే బాక్సర్తో జరిగిన ప్రిక్వార్టర్స్ పోరులో లవ్లీనా ఆది నుంచే పవర్ఫుల్ పంచ్‌లతో రెచ్చిపోయింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా తనను డిఫెండ్ చేసుకోవడంతో పాటు మూడో బౌట్లలోనూ ఆధిపత్యం చెలాయించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. క్వార్టర్స్‌లో లవ్లీనా.. టాప్ సీడ్ చైనా బాక్సర్ లి ఖియాన్తో తలపడనుంది. ఆగస్టు 4న ఈ మ్యాచ్ జరుగనుంది.
A 𝑳𝒐𝒗𝒍𝒊 PERFORMANCE FROM THE CHAMP!! 🥊
She punches her way into the Quarter-Finals 😤 💪
Stream the action on #JioCinema for FREE. Also, watch it LIVE on #Sports18!#Cheer4Bharat #OlympicsOnJioCinema #OlympicsOnSports18 #Paris2024 #Boxing pic.twitter.com/j5ogV5iWmQ
— JioCinema (@JioCinema) July 31, 2024
పారిస్ ఒలింపిక్స్‌కు ముందు వరకూ పామ్ లేమితో సతమతమైన లవ్లీనా.. కీలక టోర్నీలో మాత్రం సత్తా చాటుతూ భారత్‌కు మరో పతకాన్ని ఖాయం చేసే దిశగా ముందుకు సాగుతోంది. విశ్వక్రీడా పండుగలో మన బాక్సర్లు అమిత్ పంగాల్, ప్రీతి పన్వర్‌తో పాటు జాస్మిన్ లంబోరియా ఇంటిబాట పట్టిన నేపథ్యంలో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్, లవ్లీనా, నిషాంత్ దేవ్‌పై భారీ అంచనాలున్నాయి.
#TokyoOlympics2020 #Bronze medalist Lovlina Borgohain clinches a superb 5-0 victory over Norway’s Sunniva Hofstad at the #Paris2024Olympics.
Let the #Cheer4Bharat chants ring out loud!🥳
Tune in to DD Sports and Jio Cinema to watch live!#OlympicsOnJioCinema pic.twitter.com/aJfDqXVd0Q
— SAI Media (@Media_SAI) July 31, 2024