చెన్నై: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో భోజన విరామ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 26 రన్స్ చేసింది. ఇండియన్ బౌలర్ ఆకాశ్ దీప్(Akash Deep) రెండు వికెట్లు వేసుకున్నాడు. వరుస బంతుల్లో అతను రెండు వికెట్లు తీసుకున్నాడు. జకీర్, హక్‌లను అతను ఒకే తరహా బంతులతో క్లీన్‌బౌల్డ్ చేశాడు. బుమ్రా కూడా ఓ వికెట్ తీశాడు.
What a sight for a fast bowler!
Akash Deep rattles stumps twice, giving #TeamIndia a great start into the second innings.
Watch the two wickets here 👇👇#INDvBAN @IDFCFIRSTBank pic.twitter.com/TR8VznWlKU
— BCCI (@BCCI) September 20, 2024
చెన్నై టెస్టులో బంగ్లా బ్యాటర్లు షాద్మాన్ ఇస్లామ్(2), జకీర్ హసన్(3), మొయిముల్ హక్(0)లు స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. షాంతో, ముష్ఫికర్ క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 376 రన్స్‌కు ఆలౌటైంది. ఇవాళ తొలి సెషన్లో మొత్తం ఏడు వికెట్లు పడ్డాయి. ప్రస్తుతం భారత్ ఆధిక్యంలో ఉన్నది.
Boom Boom Bumrah 🎇
Cleans up Shadman Islam with a peach of a delivery.
Live – https://t.co/jV4wK7BgV2… #INDvBAN@IDFCFIRSTBank | @Jaspritbumrah93 pic.twitter.com/RYi9AX30eA
— BCCI (@BCCI) September 20, 2024