ఢిల్లీ: ఇంగ్లండ్‌తో సిరీస్‌లో బంతితో పాటు బ్యాట్‌తోనూ అంచనాలకు మించి రాణించిన టీమ్ఇండియా పేసర్ ఆకాశ్ దీప్ భారత హెడ్‌కోచ్ గౌతం గంభీర్ తనకు మద్దతుగా నిలిచాడని అన్నాడు. తనకంటే ఎక్కువ గంభీర్ తనను నమ్మాడని చెప్పాడు. ఓ వార్తా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆకాశ్ మాట్లాడుతూ.. ‘నీ సామర్థ్యం గురించి నీకు తెలియడం లేదు. చూడు.. నేను చెబుతున్నా. నువ్వు చేయగలవు. నువ్వు ఎప్పటికీ ఇదే స్ఫూర్తితో ఆడు’ అని గంభీర్ తనతో చెప్పినట్టు తెలిపాడు. ‘గౌతీ భాయ్ (గంభీర్) నిత్యం మాలో స్ఫూర్తి నిం పుతుండేవాడు. అతడు నన్ను నాకం టే ఎక్కువగా నమ్మాడు’ అని ఆకాశ్ చెప్పాడు.