Akash Deep : అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ ఓవల్ టెస్టులో ఆకాశ్ దీప్ (Akash Deep) ప్రవర్తనపై దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ (Ben Duckett)ను ఔట్ చేసిన తర్వాత.. అతడి భుజంపై చేయి వేసి మాట్లాడినందు భారత పేసర్‌పై నిషేధం విధించాలని డకెట్ కోచ్ డిమాండ్ చేస్తున్నాడు. తన ప్రవర్తన వివాదాస్పదం కావడంపై ఆదివారం ఆకాశ్ దీప్ స్పందించాడు. ఓవల్ టెస్టులో డకెట్ సవాల్ విసరడం వల్లనే తాను అలా వీడ్కోలు పలకానని.. అంతే తప్ప అందులో వేరే ఉద్దేశమేది లేదని ఆకాశ్ తెలిపాడు.
సిరీస్ ఫలితాన్ని నిర్ణయించిన ఓవల్ టెస్టులో ఆకాశ్ దీప్ ఓవర్లో డకెట్ బౌండరీలతో చెలరేగాడు. బజ్ బాట్ ఆటతో చెలరేగుతూ స్కోర్ బోర్డును ఉరికించాడు. ‘నువ్వు నన్ను ఔట్ చేయలేవు’ అని అనడంతో ఆకాశ్ అవునా.. ‘ఔట్ చేసి తీరుతాను’ అనుకున్నాడు. హాఫ్ సెంచరీతో విరుచుకుపడిన అతడిని ఔట్ చేసి ఇంగ్లండ్‌కు షాకిచ్చాడు భారత పేసర్. ‘నాకు డకెట్పై మంచి రికార్డు ఉంది. అతడిని పలుమార్లు ఔట్ చేశాను. లెఫ్ట్ హ్యాండర్లను వెనక్కి పంపడం అంటే నాకిష్టం. డకెట్ ఏమీ ప్రత్యేకం కాదు. కానీ, ఆ రోజు మాత్రం అతడు నా లైన్ అండ్ లెంగ్త్‌ను దెబ్బతీశాడు. సహజమైన షాట్లకు బదులు రివర్స్ స్వీప్, స్వీప్ షాట్లతో నాపై పైచేయి సాధించాడు. అంతేకాదు ‘ఈ రోజు నాది. నువ్వు నన్ను ఔట్ చేయలేవు’ అని నాతో అన్నాడు.
Had to leave Bihar due to BCA ban.
Took 3 year break at 23 after father’s paralytic attack.
Lost father & elder brother within 2 months.
Survived a career-threatening back injury.
But Akash Deep never gave up. True Hero. pic.twitter.com/bDOxnaYFu4
— Sports Culture (@SportsCulture24) July 6, 2025
అతడి మాటలు విన్నాక నాలో మరింత కసి పెరిగింది. అలానా అయితే చూద్దాం అనుకున్నా. ‘నువ్వు మిస్ అయితే నేను వికెట్ల పడగొడుతా’ అని డకెట్‌తో చెప్పాను. అలా చెప్పినట్టే.. అతడి వికెట్ తీశాను. ఇంగ్లిష్ ఓపెనర్ నిరాశగా పెవిలియన్ వెళ్తుంటే అతడి భుజంపై వేసి.. ప్రతిసారి నువ్వు విజయం సాధించలేవు. ఈసారి నేను గెలిచాను అని సరదాగా అన్నాను. నా మాటల్ని డకెట్ కూడా స్పోర్టివ్‌గానే తీసుకున్నాడు’ అని తమ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను ఆకాశ్ వెల్లడించాడు.
Finally a relief for INDIA as Duckett’s Reverse-scoop goes straight to the keeper!
Akash Deep celebrates with a grin, an arm around Duckett, and a cheeky word or two… 😂#ENGvsIND #AkashDeep #BenDuckett | 📸 : JioStar pic.twitter.com/uX9qXFjFrE
— OneCricket (@OneCricketApp) August 1, 2025
భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన ఆకాశ్.. అద్భుతమైన ఆటతో అలరించడమే కాదు టెస్టుల్లో తొలి అర్ధ శతకం సాధించాడు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు విలువైన 107 రన్స్ జోడించాడీ స్పీడ్‌గన్. ఇంగ్లండ్ పర్యటనలో 13 వికెట్లతో రాణించిన ఆకాశ్ స్వదేశం వచ్చాక తన డ్రీమ్ కారు కొన్నాడు. రాఖీ పండుగ రోజున తన సోదరీమణులతో కలిసి టయోటా ఫార్చునర్ కారు కొనుగోలు చేశాడీ పేసర్.