Akash Deep – Duckett : క్రికెట్ మైదానంలో స్లెడ్జింగ్ అందర్భాగం. ప్రత్యర్థి ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసేందుకు పనిగట్టుకొని మరీ వాళ్లను కవ్విస్తుంటారు కొందరు. బౌలర్లు అయితే వికెట్ తీయగానే.. బ్యాటర్లు అనుకోండి బౌండరీలు బాదగానే ‘చూశావా నా పవర్’ అని రోషంతో సంబురాలు చేసుకుంటారు. కానీ, మరికొందరు మాత్రం తమ హుందాతనంతో అవతలివారి మనసు గెలుచుకుంటారు. భారత పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep), ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ బెన్ డకెట్(Ben Duckett)లు అందుకు ప్రత్యక్ష ఉదాహరణా నిలుస్తున్నారు. ఓవల్ టెస్టులో వీరిద్దరి స్నేహం అందర్నీ అబ్బురపరుస్తోంది. చెప్పాలంటే వీళ్ల ప్రవర్తనే ఈ టెస్టులో ప్రత్యేక ఆకర్షణగా మారింది.
రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్ బజ్ బాల్ (Bazz Ball) ఆటతో రెచ్చిపోయాడు. ఆకాశ్ దీప్ ఓవర్లో స్వీప్ షాట్‌తో అలవోకగా సిక్సర్ బాదాడు. అనంతరం ‘నువ్వు నన్ను ఔట్ చేయలేవు’ అని పేసర్‌తో అన్నాడు. అయితే.. తర్వాతి ఓవర్లోనే డకెట్ అదే షాట్‌కు యత్నించి కీపర్ జురెల్ చేతికి చిక్కాడు. అతడి వికెట్ తీసిన సంతోషంతో గాల్లోకి పంచ్‌లు విసిరిన ఆకాశ్.. ఆ తర్వాత డగౌట్ వెళుతున్న డకెట్ భుజంపై చేయి వేసి ‘ఏం బ్రదర్ ఔట్ చేశాను చూశావా’ అని సరదాగా అన్నాడు. అందుకు ఇంగ్లండ్ ఓపెనర్ సైతం ‘ఎస్’.. అని బదులిస్తూ వెళ్లాడు.
Cuties 😂
Ben Duckett and Akash Deep 🧿 pic.twitter.com/lBEHvXtHwp— Raw Cricket Talks (@RawCricketTalks) August 2, 2025
కట్ చేస్తే.. నైట్ వాచ్‌మన్‌గా క్రీజులోకి వచ్చిన ఆకాశ్ మూడో రోజు చిరస్మరణీయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. బౌండరీలతో దడ పుట్టిస్తూ స్కోర్ బోర్డును ఉరికించాడు. ఓవర్ల మధ్యలో డకెట్, ఆకాశ్ ఇద్దరూ భుజాలపై చేతులు వేసుకొని తమ బాండింగ్‌ను చాటుకున్నారు. వీళ్లను బిగ్ స్క్రీన్‌పై చూసిన ప్రేక్షకులు.. కామెంటేటర్లు మీ ఇద్దరూ నిజయమైన జెంటల్మెన్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రత్యర్థితో యుద్ధం అంటే.. ఓడించడమే కాదు వాళ్ల మనసులు గెలవడమూ విజయం సాధించినట్టే కదా..!
🚨👉#Friendship of Akash Deep and Ben Duckett is next level👈 🇮🇳🇬🇧 😅#benduckett #AkashDeep #ENGvsIND #OvalTest #5thTest #INDvsENGTest #INDvsENG2025 pic.twitter.com/2kKtsqzNqI
— Amit Prajapati (@amit21prajapati) August 2, 2025