Ajay Jadeja : పసికూనగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అఫ్గనిస్థాన్(Afghanistan Cricket) సంచలనాలకు కేరాఫ్ అయింది. నిరుడు భారత గడ్డపై వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023)లో ఆ జట్టు సాధించిన అద్భుత విజయాలు ఓ ఉదాహరణ మాత్రమే. ఆ టోర్నీలో మాజీ చాంపియన్లకు షాకిచ్చిన అఫ్గనిస్థాన్ అబ్బురపరిచే ప్రదర్శన వెనక ఉన్నది ఎవరో తెలుసా.. టీమిండియా మాజీ క్రికెటర్. పేరు అజయ్ జడేజా (Ajay Jadeja).
అవును.. జడేజా 2023లో అఫ్గన్ జట్టుకు మెంటార్‌గా సేవలందించాడు. అయితే.. ఆ పదవితో అతడు భారీగానే ఆర్జించాను అనుకుంటే మాత్రం మీరు పొరపడినట్టే. ఎందుకంటే.. మెంటార్‌గా పనిచేసినందుకు జడేజా అఫ్గన్ బోర్డు నుంచి నయా పైసా తీసుకోకపోవడం గమనార్హం.
Candid from CWC 2023 🇦🇫 pic.twitter.com/7ZHlfcXVZp
— Ajay Jadeja (@AjayJadeja171) June 15, 2024
మెంటార్‌గా జడేజా ఒక్క రూపాయి అఫ్గనిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నసీబ్ ఖాన్(Naseeb Khan) ఈమధ్యే వెల్లడించాడు. ‘మెంటార్‌గా ఉన్నందుకు డబ్బులు తీసుకోవాల్సిందిగా మేము పలుమార్లు జడేజాను కోరాం. కానీ, అతడు మాత్రం సున్నితంగా తిరస్కరించాడు. మీరు బాగా ఆడడమే నాకు ఇవ్వాలనుకున్న డబ్బు.. పెద్ద రివార్డు అని అంటుండేవాడు’ అని నసీబ్ తెలిపాడు. భారత క్రికెట్లో గొప్ప ఆటగాడైన జడేజా 8 ఏండ్లు జాతీయ జట్టుకు ఆడాడు. 1992 నుంచి 2000 మధ్య అతడు ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు.
Long way to go 🙏 @ACBofficials 🇦🇫 https://t.co/ymFVB6aKba
— Ajay Jadeja (@AjayJadeja171) June 14, 2024
అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచ కప్‌లో అఫ్గనిస్థాన్ జైత్రయాత్ర సాగిస్తోంది. అంతేకాదు హ్యాట్రిక్ విజయాలతో తొలిసారి సూపర్ 8లో అడుగుపెట్టింది. వెస్టిండీస్ వేదికగా జరుగబోయే సూపర్ 8 ఫైట్‌లో రషీద్ ఖాన్(Rashid Khan) నేతృత్వంలోని కాబూలీ జట్టు భారత్‌ను ఢీ కొట్టనుంది. జూన్ 20న జరిగే ఈ మ్యాచ్‌లో రోహిత్ సేనకు అఫ్గన్ పేస్ త్రయం నుంచి ముప్పు తప్పకపోవచ్చు. పవర్ ప్లేలో నిప్పులు చెరిగేందుకు ప్రధాన పేసర్ ఫజల్ హక్ ఫారూఖీ ఎలాగూ ఉండనే ఉన్నాడు. మరోవైపు బలమైన బ్యాటింగ్, బౌలింగ్ యూనిట్ కలిగిన టీమిండియా అఫ్గన్ సవాల్‌కు కాచుకొని ఉంది.
#T20WorldCup Super Eight, Here we come! 🤩#AfghanAtalan | #GloriousNationVictoriousTeam pic.twitter.com/zwQeBvcfax
— Afghanistan Cricket Board (@ACBofficials) June 14, 2024