Kohli – Rohit | లెజెండ్స్ జెర్సీలతో విమాన సర్వీస్.. ఎందుకంటే..?
Kohli - Rohit : పదమూడేండ్ల ఐసీసీ ట్రోఫీ కరువు తీర్చిన భారత జట్టు (Team India)కు దేశమంతా జేజేలు పలుకుతోంది. టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma)ల జెర్సీ నంబర్లతో ఎయిరిండియా కంపెనీ సర్వీస్ నడిపింది.
Kohli – Rohit : పదమూడేండ్ల ఐసీసీ ట్రోఫీ కరువు తీర్చిన భారత జట్టు (Team India)కు దేశమంతా జేజేలు పలుకుతోంది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో అభినందనలు.. మర్యాదల తర్వాత ఓపెన్ టాప్ బస్సులో పరేడ్ కోసం ముంబై విమానమెక్కిన టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma)లకు అరుదైన గౌరవం దక్కింది. అవును.. ఈ ఇద్దరు లెజెండ్స్ జెర్సీ నంబర్లతో ఎయిరిండియా విస్తార కంపెనీ సర్వీస్ నడిపింది. టీమిండియాను ‘యూకే1845’ పేరుతో ఢిల్లీ నుంచి ముంబైకి చేర్చింది.
ప్రపంచ కప్ విజేతలకు పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లీ జెర్సీ నంబర్ 18 కాగా.. హిట్‌మ్యాన్ జెర్సీ 45. టీ20లకు గుడ్ బై చెప్పేసిన ‘రోకో’కు తమ కంపెనీ తరఫున ఈ గౌరవం కల్పించినట్టు విస్తార తెలిపింది. అంతేకాదు బార్బడోస్ నుంచి ఢిల్లీకి భారత జట్టును చేర్చిన విమాన సర్వీస్‌కు ‘AIC24WC’ పేరు ఖరారు చేసిన విషయం తెలిసిందే.
#IndianCricketTeam is traveling from Delhi to Mumbai in @airvistara‘s Flight No. UK 1845. It features Virat Kohli & Rohit Sharma’s jersey number! ✈️👕 pic.twitter.com/A12Ht6R5BI
— Prathamesh Avachare (@onlyprathamesh) July 4, 2024
అభినందనల వెల్లువ
బార్బడోస్ నుంచి పొట్టి ప్రపంచ కప్ ట్రోఫీతో స్వదేశంలో అడుగుపెట్టిన భారత జట్టుకు అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగడంతో మొదలైన అభినందనల వెల్లువ ఇంకా రెట్టింపు అవుతోంది. వరల్డ్ కప్ ట్రోఫీతో ఉదయం ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన భారత జట్టు సభ్యులు.. అశేష అభిమానుల సమక్షంలో వికర్టీ పరేడ్‌కు రెడీ అవుతున్నారు.
Magical Evening Awaits 🤩
Join us in welcoming and celebrating the #T20WorldCup Champions 🇮🇳 🏆
📍 Wankhede Stadium
🗓️ Thursday, 4th July 2024
⏰ 4:00 PM IST Onwards
Enter via Gates 2, 3 and 4#TeamIndia pic.twitter.com/UYIZgIkZly— BCCI (@BCCI) July 4, 2024
సాయంత్రం 4:30 గంటలకు ముంబైలో మెరైన్ డ్రైవ్ పరేడ్ షురూ కానుంది. అక్కడ ఓపెన్ టాప్ బస్సులో రోహిత్ సేన వరల్డ్ కప్ ట్రోఫీని అభిమానులకు చూపిస్తూ.. సందడిగా ముందుకు సాగనుంది. అనంతరం రాత్రి 7:00 గంటలకు వాంఖడే స్టేడియంలో జగజ్జేతలకు బీసీసీఐ సన్మానం చేయనుంది.
ఇవి కూడా చదవండి
- Actor Darshan | కన్నడ హీరో దర్శన్, పవిత్ర గౌడ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు..!
- AP TET Applications | జులై 17 వరకు ఏపీ టెట్‌కు దరఖాస్తుల స్వీకరణ
- Sikandar | సల్మాన్ ఖాన్ సికిందర్ సెట్స్‌లో సత్యరాజ్.. ట్రెండింగ్‌లో స్టిల్స్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

