AP TET Applications | జులై 17 వరకు ఏపీ టెట్‌కు దరఖాస్తుల స్వీకరణ
AP TET Applications | ఆంధ్రప్రదేశ్ ఎలిబిబిలిటీ టెస్ట్ 2024కు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమయ్యింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎలిబిబిలిటీ టెస్ట్ (TET) -2024కు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల (Online Applications) ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమయ్యింది. దరఖాస్తుల స్వీకరణ జులై 17 వరకు కొనసాగుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. త్వరలోనే పరీక్ష తేదీలు వెల్లడిస్తామని అన్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగుల వినతులకు సానుకూలంగా స్పందిస్తుంది.
ఇందులో భాగంగా టెట్ పరీక్షకు, డీఎస్సీ(DSC) పరీక్షలకు సన్నద్ధం కావడానికి సమయం కావాలని అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) స్పందించారు. టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య కొంత సమయం పొడగించి పరీక్షల తేదీని త్వరలో వెల్లడించనున్నారు. దరఖాస్తు రుసుముల చెల్లింపులకు ఈనెల 16వ తేదీ వరకు ఆఖరు తేదీగా నిర్ణయించారు.
కొత్తగా బీఈడీ, డీఎడ్ పూర్తి చేసుకున్న వారికి కూడా మెగా డీఎస్సీలో అవకాశం కల్పించడం పట్ల అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం 6వేల పోస్టులతో ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్(Notification) ను చంద్రబాబు సర్కార్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. బదులుగా 16,347 పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అయితే రద్దైన గత డీఎస్సీకి దరఖాస్తు చేసిన వారికి మెగా డీఎస్సీలో ఫీజు మినహాయింపునిచ్చింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

