PR Sreejesh | భారత హాకీ జట్టులో మిస్టర్ వాల్‌గా పేరొందిన గోల్ కీపర్ పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచాక రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వెటరన్ ప్లేయర్ హాకీ ఇండియా కీలక బాధ్యతలు అప్పగించింది. జూనియర్ పురుషుల హాకీ జట్టుకు హెడ్ కోచ్‌గా నియమించింది. ఇకపై యువ జట్టును తీర్చిదిద్దనున్నాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్‌ను టీమిండియా 2-1 తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. శ్రీజేష్ జట్టులో కీలకపాత్ర పోషించాడు. స్పెయిన్‌తో జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో సైతం శ్రీజేష్ చివరి క్వార్టర్లో అద్భుతంగా సేవ్ చేసి స్పెయిన్ ఆధిక్యంలోకి రాకుండా చూశాడు.
ఈ విధంగా శ్రీజేష్‌కు జట్టు విజయంతో వీడ్కోలు పలికాడు. మ్యాచ్ అనంతరం శ్రీజేష్ హాకీకి వీడ్కోలు పలికాడు. రిటైర్మెంట్ ప్రకటనకు ఇదే సరైన సమయమని తెలిపాడు. పతకంతో ఆటకు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని తాను భావిస్తున్నానని చెప్పాడు. టోక్యోలో గెలిచిన పతకానికి ప్రత్యేక స్థానం ఉందని.. దాంతో తాము ఈ ఒలింపిక్స్‌లో పతకాలు గెలుస్తామనే విశ్వాసాన్ని ఇచ్చిందని చెప్పాడు. శ్రీజేశ్ 2014, 2022 ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. 2018 ఆసియా క్రీడల్లో కాంస్యం, 2022లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ సాధించిన జట్టులోనూ ఉన్నాడు. 18 సంవత్సరాల కెరియర్లో భారత్ జట్టు తరఫున 328 మ్యాచులు ఆడాడు.