పారిస్: పారిస్ ఒలింపిక్స్‌లో పతాకధారులుగా(Flag-Bearer) ఇద్దరు క్రీడాకారుల పేర్లను భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది. తాజా మెగా క్రీడల్లో రెండు కాంస్య పతకాలు గెలిచిన షూటర్ మనూ భాకర్ పేరును ఇప్పటికే ప్రకటించారు. అయితే ముగింపు వేడుకల్లో భారత జాతీయ జెండాను ఆవిష్కరించే అవకాశాన్ని హాకీ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్‌కు కూడా కల్పించారు. పతాకధారులుగా పీఆర్ శ్రీజేష్, మనూ భాకర్ ఉండనున్నట్లు ఐఓఏ ఇవాళ ప్రకటించింది. శ్రీజేష్ అంశంలో ఐఓఏ సభ్యులు భావోద్వేగపూరిత నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష తెలిపారు. హాకీలో ఇండియా బ్రాంజ్ మెడల్ గెలిచింది. అయితే చివరి మ్యాచ్ తర్వాత శ్రీజేష్.. హాకీకి రిటైర్మెంట్ ప్రకటించారు.