Manu Bhaker : పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024) లో రెండు కాంస్య పతకాలు సాధించిన భారత షూటర్ మనూభాకర్ (Manu Bhaker) శుక్రవారం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ (Bhagavanth Singh Mann) ను కలిశారు. ఆమె తన తల్లి, తండ్రి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి పంజాబ్ సీఎంతో భేటీ అయ్యారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హర్యానాలో వీరి భేటీ జరిగింది.
పారిస్ ఒలింపిక్స్లో మనూభాకర్ అద్భుత ప్రదర్శన చేశారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ విభాగంలో కాంస్యం గెలిచారు. ఆ తర్వాత మరో షూటర్ సరబ్జోత్ సింగ్తో కలిసి 25 మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ ఈవెంట్లో మరో కాంస్యం సాధించారు. దాంతో ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె నిలిచారు.
పారిస్ ఒలింపిక్స్లో సత్తా చాటి భారత్కు చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఇవాళ ఆమె కుటుంబంతో కలిసి పంజాబ్ సీఎంతో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా మనూభాకర్తో భగవంత్ మాన్ పలు అంశాలపై మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ఖ్యాతి తెచ్చిపెట్టిన మనూభాకర్ను ఆయన అభినందించారు.
#WATCH | Double Olympic medalist Manu Bhaker meets Punjab CM Bhagwant Mann, in Chandigarh
(Source: DPR) pic.twitter.com/hzNNwqB8Rz
— ANI (@ANI) August 9, 2024