Asia Cup 2025 : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా మరికొన్ని నిమిషాల్లో ఆసియా కప్ (Asia Cup 2025) ప్రారంభం కానుంది. ఆసియా దేశాల వరల్డ్ కప్‌గా పేరొందిన మెగా టోర్నీ అఫ్గనిస్థాన్(Afghanistan), హాంకాంగ్(Hong Kong) మ్యాచ్‌తో మొదలవ్వనుంది. అబూదాబీలోని షేక్ జయద్ స్టేడియం వేదికగా జరుతున్న తొలి పోరులో కాబూలీ టీమ్ సారథి రషీద్ ఖాన్ టాస్ గెలిచాడు. ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలనే లక్ష్యంతో అతడు బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
పదిహేడో సీజన్ ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో జరుగనుంది. ఆసియాకు చెందిన ఎనిమిది జట్లు ఈ మెగా టోర్నీలో తలపడుతున్నాయి. సూర్యకుమార్ సారథ్యంలోని భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ఆరంభం పోరుకు ముందు ఎనిమిది జట్ల కెప్టెన్లు ట్రోఫీతో ఫొటోలకు పోజిచ్చారు.
అఫ్గనిస్థాన్ తుది జట్టు: రహ్మనుల్లా గుర్జాబ్ (వికెట్ కీపర్), సెదీఖుల్లా అఫ్తల్, ఇబ్రహీం జద్రాన్, గుల్బదిన్ నయీబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మొహమ్మద్ నబీ, కరీం జన్నత్, రషీద్ ఖాన్ (కెప్టెన్), నూర్ అహ్మద్, ఏఎం ఘజన్ఫర్, ఫజల్హక్ ఫారూఖీ.
హాంకాంగ్ తుది జట్టు : జీషన్ అలీ(వికెట్ కీపర్), బాబర్ హయత్, అన్షుమన్ రథ్, కల్హన్ చాల్లు, నిజకత్ ఖాన్, ఐజజ్ ఖాన్, కించిత్ షా, యసీం ముర్తాజా (కెప్టెన్), ఆయుష్ శుక్లా, అతీక్ ఇక్బాల్, ఈషన్ ఖాన్.
ఆసియా కప్ ట్రోఫీతో ఎనిమిది జట్ల కెప్టెన్లు